Poland | భారత్‌తో రక్షణ బంధం.. కీలక నిర్ణయం తీసుకున్న పోలాండ్..
Poland | భారత్, పోలాండ్ దేశాల మధ్య రక్షణ వాణిజ్యం, పారిశ్రామిక సహకారం మరింత బలపడనున్నాయి. ఈ మేరకు పోలాండ్ ప్రణాళికలకు సిద్ధమవుతోంది. భారత్‌కు తమ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని భావిస్తున్నామని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి ఆండ్రెజ్ డొమాన్స్కీ తెలిపారు.
Poland | భారత్, పోలాండ్ దేశాల మధ్య రక్షణ వాణిజ్యం, పారిశ్రామిక సహకారం మరింత బలపడనున్నాయి. ఈ మేరకు పోలాండ్ ప్రణాళికలకు సిద్ధమవుతోంది. భారత్‌కు తమ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని భావిస్తున్నామని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి ఆండ్రెజ్ డొమాన్స్కీ తెలిపారు. మిలాక్వీలో కొనసాగుతున్న జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన భారత మీడియా సంస్థలతో మాట్లాడారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ అక్టోబర్ చివర్లో భారత్‌లో పర్యటించనున్నారని తెలిపారు. అదే సమయంలో పోలాండ్‌కు చెందిన రక్షణ రంగ సంస్థలను భారత్‌కు తీసుకురానున్నామని తెలిపారు. తాము భారత్‌తో కలిసి బలమైన రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు గాను భారత్ వంటి విశ్వసనీయ దేశాల భాగస్వామ్యం అవసరమని అన్నారు. రక్షణ ఉత్పత్తుల విషయంలో మంచి వాణిజ్య సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. భారత్‌కు తమ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని కోరుకుంటున్నామని, తమ ప్రధాని పర్యటన సందర్భంగా ఈ వివరాలపై స్పష్టత వస్తుందని తెలిపారు.
న్యూఢిల్లీ, బెంగళూరుల్లో టస్క్ పర్యటన..
టస్క్ తన భారత్ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీతోపాటు బెంగళూరును కూడా సందర్శించనున్నారు. ఈ మేరకు డొమాన్స్కీ వివరాలను వెల్లడించారు. ఈ పర్యటనలో సుమారు 100 కంపెనీలతో కూడిన ప్రతినిధి బృందం సైతం పాల్గొంటుందని తెలిపారు. కాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2024లో వార్సా పర్యటన సందర్భంగా భారత్, పోలాండ్ మధ్య ఏర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా టస్క్ పర్యటన ఉంటుందని డొమాన్స్కీ వివరించారు. ఇరు దేశాలు అప్పట్లో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, హరింత సాంకేతికతలు, వ్యవసాయం, మౌలిక వసతులు తదితర రంగాలకు సంబంధించి ఐదేళ్ల కార్యాచర్యణ ప్రణాళికకు ఆమోదం తెలిపాయి. ఈ నేపథ్యంలోనే టస్క్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
సంబంధిత వార్తలు

YouTube | యూట్యూబ్‌తో భారత్‌కు భారీ ఆర్థిక ప్రయోజనం.. రూ.18 వేల కోట్ల జీడీపీకి దోహదం..
సెప్టెంబర్ 30, 2026

Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
సెప్టెంబర్ 29, 2026

Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్లే: ఎంపీ రాఘవ్ చద్దా
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●ISRO | గువాహటికి ఇస్రో కొత్త కేంద్రం.. అంతరిక్ష భద్రతకు మరింత బలం..
- ●Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ
- ●Raghunandan Rao | రేవంత్, కేటీఆర్ ఆస్తులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: రఘునందన్ రావు
- ●EC orders special drive | సర్ తర్వాత ఓటర్ల జాబితాలో పేరు లేదా..? ప్రత్యేక డ్రైవ్‌కు ఈసీ ఆదేశం
- ●India Saudi Arabia | భారత్-సౌదీ మధ్య సముద్రగర్భ విద్యుత్ లైన్.. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్..
- ●Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు

ISRO | గువాహటికి ఇస్రో కొత్త కేంద్రం.. అంతరిక్ష భద్రతకు మరింత బలం..

Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ

Raghunandan Rao | రేవంత్, కేటీఆర్ ఆస్తులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: రఘునందన్ రావు

EC orders special drive | సర్ తర్వాత ఓటర్ల జాబితాలో పేరు లేదా..? ప్రత్యేక డ్రైవ్‌కు ఈసీ ఆదేశం



