Trading | శనివారం స్టాక్ మార్కెట్లు బంద్.. అయినా కూడా ట్రేడింగ్ చేయొచ్చు.. ఎలాగంటే?
ఇక.. ఇథీరియం 2930 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇథీరియం కూడా 4500 డాలర్లకు పైగా ఇటీవల ట్రేడ్ అయింది. ఇప్పుడు 3000 డాలర్లు దిగువకు చేరుకుంది. ఇంకో క్రిప్టో కరెన్సీ సొలానా ప్రస్తుతం 123 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Trading | ప్రతి శనివారం, ఆదివారం భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. కేవలం ఇండియన్ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేసేవాళ్లు ప్రతి శనివారం, ఆదివారం ఖాళీగా ఉండాల్సిందే. కొందరు కేవలం ఇండియన్ స్టాక్ మార్కెట్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంటారు. అటువంటి వాళ్లు శనివారం, ఆదివారం ఖాళీగానే ఉంటారు. కానీ.. కొందరు మాత్రం భారత స్టాక్ మార్కెట్లతో పాటు మరి కొన్ని స్టాక్ మార్కెట్లలో పని చేస్తుంటారు. యూఎస్ స్టాక్ మార్కెట్లు, కమోడిటీ మార్కెట్లు, క్రిప్టో మార్కెట్లు, ఫారెక్స్ ట్రేడింగ్ లాంటివి చేస్తుంటారు. ఇందులో క్రిప్టో ట్రేడింగ్ మాత్రం 24*7 నడుస్తుంది. ఆదివారం లేదు.. పండుగ పబ్బాలు ఏం ఉండవు. క్రిప్టో ట్రేడింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి సెలవులు ఉండవు. అర్ధరాత్రి కూడా క్రిప్టో ట్రేడింగ్ చేసుకోవచ్చు.
ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలామంది క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకొని ఖాళీగా ఉన్న సమయాల్లో క్రిప్టో ట్రేడింగ్ చేస్తుంటారు. క్రిప్టో ట్రేడింగ్ అనగానే ఇది మన దేశంలో లీగల్ కాదు అని అంటుంటారు. కానీ.. మన దేశంలో క్రిప్టో ట్రేడింగ్ లీగలే. క్రిప్టో ట్రేడింగ్ చేసి సంపాదించిన డబ్బులపై కేంద్రానికి టాక్స్ కూడా కట్టాలి. క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి చాలా ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. క్రిప్టో ట్రేడింగ్‌లో మెయిన్‌గా బిట్‌కాయిన్, ఇథీరియం, సొలాన లాంటి కాయిన్స్ మీద ట్రేడింగ్ చేస్తుంటారు. ఈ మార్కెట్ శని, ఆదివారాల్లోనూ ఓపెన్ ఉంటుంది కాబట్టి.. చాలామంది సోమవారం నుంచి శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు, శని, ఆదివారాలు క్రిప్టో మార్కెట్ లో ట్రేడ్ చేస్తుంటారు.
Trading | 87454 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్
ఇటీవల బిట్ కాయిన్ వాల్యూ లక్ష డాలర్లు దాటింది. లక్షా 20 వేలకు పైగా ట్రేడ్ అయి ఆ తర్వాత డౌన్ అవుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా బిట్ కాయిన్ వాల్యూ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం 87454 వద్ద బిట్ కాయిన్ ట్రేడ్ అవుతోంది.
ఇక.. ఇథీరియం 2930 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇథీరియం కూడా 4500 డాలర్లకు పైగా ఇటీవల ట్రేడ్ అయింది. ఇప్పుడు 3000 డాలర్లు దిగువకు చేరుకుంది. ఇంకో క్రిప్టో కరెన్సీ సొలానా ప్రస్తుతం 123 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్
- ●Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ
- ●RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు

TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్






