త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | బడ్జెట్ 2026 ఆదాయపు పన్ను అంచనాలు: పన్ను రహిత పరిమితి రూ. 15 లక్షలకు పెరుగుతుందా? మధ్యతరగతి ఆశలన్నీ దీనిపైనే!

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు, మినహాయింపుల పెంపుపై సామాన్యులు ఆశలు పెట్టుకున్నారు. పన్ను చెల్లింపుదారులు ఈసారి బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారు?

J

Business | Published On Jan 20, 2026, 2.00 pm IST

Union Budget 2026 | బడ్జెట్ 2026 ఆదాయపు పన్ను అంచనాలు: పన్ను రహిత పరిమితి రూ. 15 లక్షలకు పెరుగుతుందా? మధ్యతరగతి ఆశలన్నీ దీనిపైనే!

సంక్షిప్త సారాంశం

బడ్జెట్ 2026లో కొత్త పన్ను విధానం కింద పన్ను రహిత ఆదాయ పరిమితిని రూ. 15 లక్షలకు పెంచుతారా? పాత పన్ను విధానం రద్దవుతుందా? సెక్షన్ 80C, 80D కింద అదనపు ప్రయోజనాలు లభిస్తాయా? వంటి కీలక అంశాలపై విశ్లేషణ.

Advertisement

Union Budget 2026 | త్రినేత్ర.న్యూస్: కేంద్ర బడ్జెట్ 2026-27 కి సమయం దగ్గర పడుతుండటంతో దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా ప్రకటించి మధ్యతరగతి ప్రజలకు భారీ ఉపశమనం కలిగించారు. ఈసారి ఆ పరిమితిని మరింత పెంచుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు?

గత బడ్జెట్ (2025-26)లో రూ.12 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా (రీబేట్‌తో కలిపి) ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఈ పరిమితిని రూ.15 లక్షలకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, 30 శాతం ఉన్న గరిష్ట పన్ను స్లాబ్‌ను రూ.30 లక్షల ఆదాయం దాటిన వారికి మాత్రమే వర్తింపజేయాలనే డిమాండ్ కూడా ఉంది.

స్టాండర్డ్ డిడక్షన్

పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని ప్రైవేట్ రంగ ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి కూడా 80C(పెట్టుబడులు), 80D(హెల్త్ ఇన్సూరెన్స్) మినహాయింపులు పొందే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇళ్ల ధరలు, ఈఎంఐలు (EMI) భారీగా పెరగడంతో సెక్షన్ 24(బి) కింద గృహ రుణం వడ్డీపై ఇచ్చే రాయితీని పెంచాలని గృహ కొనుగోలుదారులు ఆశిస్తున్నారు.

సీనియర్ సిటిజన్లు, మహిళల అంచనాలు

పెన్షనర్లకు పన్ను రిటర్నుల దాఖలును మరింత సులభతరం చేయాలని, బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. మహిళా పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక రిబేట్లు లేదంటే వారు వర్క్ ఫోర్స్ లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక మినహాయింపులు ఉండవచ్చని భావిస్తున్నారు.

పెట్టుబడిదారులకు ఊరట లభిస్తుందా?

ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ పెట్టుబడులపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్నును సరళీకృతం చేయాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు. వేర్వేరు ఆస్తులకు వేర్వేరు పన్ను నిబంధనలు ఉండటం వల్ల గందరగోళం ఏర్పడుతున్నదని, దీనిని క్రమబద్ధీకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏఐ ఆధారిత స్క్రూటినీ

కేవలం పన్ను తగ్గింపులే కాకుండా, ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని, అనవసరమైన నోటీసులను తగ్గించాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఏఐ ఆధారిత స్క్రూటినీ ద్వారా పన్ను వ్యవస్థను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే తన బడ్జెట్ పెట్టెలో పన్ను చెల్లింపుదారుల కోసం ఎలాంటి తీపి కబుర్లు ఉంచారో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement