త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IT Returns | రూ.12.75 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ.. అయినా ఐటీఆర్ తప్పనిసరి..

IT Returns | దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి తీసుకొచ్చిన కొత్త మార్పులతో, న్యూ ట్యాక్స్ రీజీమ్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయం ట్యాక్స్ ఫ్రీగా మారింది. అయితే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకపోయినా, ఐటీఆర్ ఫైల్ చేయడం మాత్రం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.

S

Business | Published On May 20, 2026, 3.11 pm IST

IT Returns | రూ.12.75 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ.. అయినా ఐటీఆర్ తప్పనిసరి..
Advertisement

IT Returns | దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి తీసుకొచ్చిన కొత్త మార్పులతో, న్యూ ట్యాక్స్ రీజీమ్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయం ట్యాక్స్ ఫ్రీగా మారింది. అయితే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకపోయినా, ఐటీఆర్ ఫైల్ చేయడం మాత్రం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ఐటీఆర్ ఫైలింగ్ ద్వారా ట్యాక్స్ రికార్డులు సక్రమంగా నిర్వ‌హ‌ణ‌లో ఉంటాయి. అదేవిధంగా ట్యాక్స్ రిఫండ్ క్లెయిమ్ చేయడానికి, అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెరిఫికేషన్ సమయంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. కొత్త నిబంధనల ప్రకారం శాలరీడ్ ఉద్యోగులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. దీంతో మొత్తం ఆదాయం రూ.12.75 లక్షల వరకు ఉన్నా, అది ప్రాక్టికల్‌గా ట్యాక్స్ ఫ్రీగా మారుతుంది.

కొత్త ట్యాక్స్ రీజీమ్‌లో..

ఉదాహరణకు ఒక వ్య‌క్తి వార్షిక జీతం రూ.12.5 లక్షలు అయితే, స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ.11.75 లక్షలకు పడిపోతుంది. సెక్షన్ 87ఎ కింద రూ.12 లక్షల వరకు ట్యాక్సబుల్ ఇన్‌కమ్ ఉన్నవారికి పూర్తి రిబేట్ లభించడంతో ట్యాక్స్ లయబిలిటీ జీరోగా ఉంటుంది. న్యూ ట్యాక్స్ రీజీమ్‌లో బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ రూ.4 లక్షల వరకు ఉంది. ఇందులో చాలా డిడక్షన్లు రద్దు చేసినప్పటికీ, కొన్ని ప్రయోజనాలు మాత్రం కొనసాగుతున్నాయి. సెక్షన్ 80సిసిడి(2) కింద ఎంప్లాయర్ చేసే ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్‌పై బేసిక్ పేలో 14 శాతం వరకు డిడక్షన్ పొందొచ్చు. సెక్షన్ 24 కింద లెట్-అవుట్ ప్రాపర్టీపై హోమ్ లోన్ ఇంటరెస్ట్‌కు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. అయితే ప్రసిద్ధి చెందిన సెక్షన్ 80సి కింద లభించే రూ.1.5 లక్షల వరకు డిడక్షన్ మాత్రం ఇప్పటికీ ఓల్డ్ ట్యాక్స్ రీజీమ్‌కే పరిమితమైంది.

ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే..

ట్యాక్స్ పేయర్లకు న్యూ రీజీమ్ లేదా ఓల్డ్ రీజీమ్ ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ రూ.12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికీ న్యూ రీజీమ్ ఎక్కువ ప్రయోజనకరంగా మారుతోంది. దీనికి కారణం ఓల్డ్ రీజీమ్‌లో ట్యాక్స్ రేట్లు ఎక్కువగా ఉండటం, రిబేట్ పరిమితులు తక్కువగా ఉండటం. అంతేకాదు, ఓల్డ్ రీజీమ్‌లో బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ కేవలం రూ.2.5 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. ఫైనాన్షియల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొత్తం డిడక్షన్లు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉంటే మాత్రమే ఓల్డ్ ట్యాక్స్ రీజీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. లేదంటే రూ.20 లక్షల వరకు ఆదాయం ఉన్న సందర్భాల్లో కూడా న్యూ ట్యాక్స్ రీజీమ్‌నే బెటర్ ఆప్షన్‌గా భావిస్తున్నారు. తక్కువ ట్యాక్స్ రేట్లు, సరళమైన విధానం, తక్కువ డాక్యుమెంటేషన్ కారణంగా న్యూ ట్యాక్స్ రీజీమ్ ప్రస్తుతం శాలరీడ్ ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది. అయితే ట్యాక్స్ ఫ్రీ అయినంత మాత్రాన ఐటీఆర్ రిట‌ర్న్‌ల‌ను ఫైల్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని భావించ‌కూడ‌ద‌ని, త‌ప్పనిస‌రిగా ఫైల్ చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement