Bank Of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడా యూపీఐ యాప్‌లో భారీ అప్‌డేట్.. ఫేస్ వెరిఫికేషన్‌తో పేమెంట్లు చేయవచ్చు..
Bank Of Baroda | ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా తన యూపీఐ యాప్ బాబ్ ఇ పే లో కొత్త డిజిటల్ పేమెంట్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. బయోమెట్రిక్ పేమెంట్ ఆథెంటికేషన్, యూఐడీఏఐ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా యూపీఐ పిన్ సేవలు, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత పేమెంట్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ ప్రకటించింది.
Bank Of Baroda | ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా తన యూపీఐ యాప్ బాబ్ ఇ పే లో కొత్త డిజిటల్ పేమెంట్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. బయోమెట్రిక్ పేమెంట్ ఆథెంటికేషన్, యూఐడీఏఐ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా యూపీఐ పిన్ సేవలు, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత పేమెంట్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం బాబ్ ఇ పే ఒక యూనివర్సల్ యూపీఐ అప్లికేషన్. దీన్ని కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులే కాకుండా ఏ బ్యాంక్ కస్టమర్లు అయినా ఉపయోగించుకోవచ్చు. కొత్త బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఫీచర్ ద్వారా వినియోగదారులు రూ.5వేల వరకు యూపీఐ లావాదేవీలను మొబైల్‌లో నమోదైన ఫింగర్‌ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ సహాయంతో ఆథరైజ్ చేయవచ్చు. ఈ ఫీచర్ పర్సన్ టు పర్సన్ (పి2పి), పర్సన్ టు మర్చంట్ (పి2ఎం) ట్రాన్సాక్షన్‌లతోపాటు బ్యాలెన్స్ ఎంక్వైరీలకు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే వినియోగదారులు అవసరమైతే యూపీఐ పిన్ విధానాన్ని కూడా కొనసాగించవచ్చు.
సులభంగా యూపీఐ పిన్‌ను సెట్ చేసుకునే వీలు..
అదేవిధంగా యూపీఐ పిన్ సెట్ చేయడం లేదా రీసెట్ చేసుకోవడం కోసం ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సేవను కూడా బ్యాంక్ ప్రారంభించింది. ఈ విధానంలో యూఐడీఏఐ ఫేస్ ఆథెంటికేషన్‌తోపాటు బ్యాంక్ ఓటీపీ వెరిఫికేషన్ ఉపయోగిస్తారు. దీంతో డెబిట్ కార్డులు లేదా ఓటీపీ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్‌పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని బ్యాంక్ పేర్కొంది. బాబ్ ఇ పే ప్లాట్‌ఫామ్‌లో ఐఓటీ డివైస్‌ల ద్వారా యూపీఐ పేమెంట్లను కూడా ప్రారంభించినట్లు బ్యాంక్ వెల్లడించింది. కనెక్టెడ్ వెహికల్స్, స్మార్ట్ అప్లయెన్సెస్ వంటి సపోర్టెడ్ డివైస్‌లను యాప్‌కు లింక్ చేసి నేరుగా వాటి ద్వారానే చెల్లింపులు చేయవచ్చని తెలిపింది.
ఐఓటీ పేమెంట్ ఫీచర్ డెలిగేట్ పేమెంట్స్ ఫ్రేమ్‌వర్క్ కింద పనిచేస్తుందని బ్యాంక్ పేర్కొంది. ఇందులో ప్రైమరీ యూజర్ ముందుగా నిర్ణయించిన పరిమితులలో సెకండరీ యూజర్ లేదా డివైస్‌కు ట్రాన్సాక్షన్ అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్






