త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Insurance Plan | గ్యారంటీడ్ రిట‌ర్న్స్‌తోపాటు పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు ఆర్థిక భ‌రోసానిచ్చే కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్

Insurance Plan | దేశంలోని ప్ర‌ముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్ల‌లో ఒక‌టిగా ఉన్న బ‌జాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త‌గా బ‌జాజ్ లైఫ్ యంగ్ అచీవ‌ర్ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. పిల్ల‌ల భ‌విష్య‌త్ ల‌క్ష్యాల‌కు స‌మ‌గ్ర ర‌క్ష‌ణ అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ పాల‌సీని అందుబాటులోకి తెచ్చారు. దీంతో పిల్ల‌ల‌కు ఇన్సూరెన్స్ సొల్యూష‌న్ ల‌భించ‌డంతోపాటు సంప‌ద సృష్టికి కూడా వీలువుతుంది.

S

Business | Published On May 4, 2026, 5.44 pm IST

Insurance Plan | గ్యారంటీడ్ రిట‌ర్న్స్‌తోపాటు పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు ఆర్థిక భ‌రోసానిచ్చే కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
Advertisement

Insurance Plan | దేశంలోని ప్ర‌ముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్ల‌లో ఒక‌టిగా ఉన్న బ‌జాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త‌గా బ‌జాజ్ లైఫ్ యంగ్ అచీవ‌ర్ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. పిల్ల‌ల భ‌విష్య‌త్ ల‌క్ష్యాల‌కు స‌మ‌గ్ర ర‌క్ష‌ణ అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ పాల‌సీని అందుబాటులోకి తెచ్చారు. దీంతో పిల్ల‌ల‌కు ఇన్సూరెన్స్ సొల్యూష‌న్ ల‌భించ‌డంతోపాటు సంప‌ద సృష్టికి కూడా వీలువుతుంది. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల కోసం గ్యారంటీడ్ ఫైనాన్షియ‌ల్ కార్ప‌స్‌ను నిర్మించేందుకు ఈ ప్లాన్ స‌హాయం చేస్తుంది. జీవితంలో అనుకోని ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు కూడా పిల్ల‌ల ముఖ్య‌మైన ల‌క్ష్యాలు ఆర్థికంగా భ‌ద్రంగా ఉండేలా ఈ ప్లాన్‌ను రూపొందించారు. త‌ల్లి లేదా తండ్రి లేదా ఇద్ద‌రి మ‌ర‌ణం, వైక‌ల్యం ఏర్ప‌డ‌డం, క‌వ‌ర్ చేసిన క్రిటిక‌ల్ వ్యాధులు నిర్దార‌ణ అయిన స‌మ‌యంలో భ‌విష్య‌త్ ప్రీమియంలు అన్నీ ర‌ద్దు చేయ‌బ‌డ‌తాయి.దీంతో పాల‌సీ కూడా అంత‌రాయం లేకుండా కొన‌సాగుతుంది.

భవిష్య‌త్తులో ఇబ్బందులు రాకుండా..

ఈ యంగ్ అచీవ‌ర్ ప్లాన్ పిల్ల‌ల స్కూల్ ఖ‌ర్చులు, ఉన్న‌త విద్య ఫీజుల నుంచి ఎక్స్‌ట్రా క‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్ వ‌ర‌కు పిల్ల‌ల‌కు సంబంధించిన అన్ని విద్యావ‌స‌రాల‌ను క‌వ‌ర్ చేస్తుంది. దీంతో పిల్ల‌ల‌కు భ‌విష్య‌త్తులో ఏ విధ‌మైన ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. ఈ ప్లాన్ ను తీసుకుంటే పాల‌సీదారుల‌కు గ్యారంటీడ్ రిట‌ర్న్స్‌ను ఇస్తారు. దీని వ‌ల్ల పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం సుర‌క్షిత‌మైన కార్ప‌స్‌ను నిర్మించ‌వ‌చ్చు. ఇది వారి భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను తీరుస్తుంది. అలాగే గ్యారంటీడ్ లంప్స‌మ్ పేమెంట్ లేదా గ్యారంటీడ్ రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ వేరియెంట్ల‌ను ఈ ప్లాన్‌లో ఎంపిక చేసుకోవచ్చు. దీంతో పిల్ల‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా పేమెంట్ పొంద‌వచ్చు. ఈ ప్లాన్ తీసుకునే త‌ల్లిదండ్రుల‌కు స‌మ‌గ్ర క‌వ‌రేజ్ ల‌భిస్తుంది. ప్రీమియం ఒక వేళ ర‌ద్దు అయితే రైడ‌ర్ బెనిఫిట్ ద్వారా డెత్‌, యాక్సిడెంట‌ల్ టోట‌ల్ ప‌ర్మినెంట్ డిజేబిలిటీ (ఏటీపీడీ), 25 ప్ర‌ధాన క్రిటిక‌ల్ వ్యాధుల‌కు క‌వ‌రేజ్ ల‌భిస్తుంది.

నిరంతరం భ‌రోసా అవ‌స‌రం..

ఈ పాల‌సీకి భిన్న ర‌కాల ప్రీమియం చెల్లింపు కాల‌వ్య‌వ‌ధులు అందుబాటులో ఉన్నాయి. 5 నుంచి 12 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధితో ప్రీమియంల‌ను చెల్లించ‌వ‌చ్చు. పిల్ల‌ల భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా పాల‌సీ ట‌ర్మ్‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. ఈ పాల‌సీని తీసుకుంటే ప్రీమియం, లాభాలపై ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే సున్నా శాతం జీఎస్‌టీ ప్రయోజ‌నాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప్లాన్ లాంచింగ్ సంద‌ర్భంగా బ‌జాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఏజెన్సీ ఆఫీస‌ర్ స‌మీర్ జోషి మాట్లాడుతూ ప్ర‌తి పేరెంట్ త‌మ పిల్ల‌ల ఆశ‌యాలు ఏ ప‌రిస్థితుల్లో అయినా సుర‌క్షితంగా ఉండాల‌ని కోరుకుంటార‌ని తెలిపారు. పెరుగుతున్న విద్యా ఖ‌ర్చులు, మారుతున్న ల‌క్ష్యాల నేప‌థ్యంలో ఆ భరోసా నిరంత‌రం ఉండాల‌ని అన్నారు. ఈ యంగ్ అచీవ‌ర్ ప్లాన్ ద్వారా పిల్ల‌ల ముఖ్య‌మైన మైలు రాళ్లు లేదా ల‌క్ష్యాలు ఎప్ప‌టికీ ఆర్థికంగా భ‌ద్రంగా ఉంటాయ‌ని అన్నారు. ఈ ప్లాన్ వ‌ల్ల భార‌తీయ కుటుంబాల‌కు భవిష్య‌త్తుకు సిద్ధ‌మైన ఆర్థిక ప‌రిష్కారాల‌ను అందించాల‌నే సంస్థ అంకితభావం స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని, విద్యాఖ‌ర్చులు పెరుగుతున్న ఈ కాలంలో పిల్ల‌ల ఆశయాల‌ను నెర‌వేర్చేందుకు త‌ల్లిదండ్రుల‌కు ఈ ప్లాన్ ఒక విశ్వ‌స‌నీయ ఆర్థిక ఆధారంగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement