త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నాం.. సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | 2009లో పాల‌మూరు జిల్లాకు కేసీఆర్ వ‌ల‌సొచ్చి ఎంపీగా గెలిచాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయినా కూడా తెలంగాణ‌లో ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయ‌లేద‌ని సీఎం ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Jun 5, 2026, 7.36 pm IST

CM Revanth Reddy | కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నాం.. సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : 2009లో పాల‌మూరు జిల్లాకు కేసీఆర్ వ‌ల‌సొచ్చి ఎంపీగా గెలిచాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయినా కూడా తెలంగాణ‌లో ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయ‌లేద‌ని సీఎం ధ్వ‌జ‌మెత్తారు. జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.

మీ అంద‌రికి గుర్తుండి ఉండొచ్చు. 2009 క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఓడిపోతా అని, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన‌ మాట నిల‌బెట్టుకోలేద‌ని మ‌ళ్లీ వారి చేతికి దొరికితే చీకి చింత‌కు క‌డుతార‌ని ఇక్క‌డికి ఓ నాయ‌కుడు వ‌చ్చిండు. తెలంగాణ ఉద్య‌మం పేరు చెప్పి, పాల‌మూరు జిల్లా వ‌ల‌స‌లు, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మ‌ర్లు గురించి ప్ర‌స్తావిస్తే మీరు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించార అని రేవంత్ గుర్తు చేశారు.

కేసీఆర్‌ను భుజాల‌పై మోసి గెలిపించాం..

వ‌ల‌స‌ల క‌ష్టాలు, ఆత్మ‌హ‌త్య‌ల క‌ష్టాలు న‌ష్టాలు మ‌న‌కు తెలుసు. క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి వ‌ల‌సొచ్చిన కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుని, భుజాల‌పై మోసి గెలిపించాం. గెలిచిన కేసీఆర్ ఐదేండ్లు ఎంపీగా ఉన్న ఐదు సార్లు మ‌న జిల్లాకు రాలేదు. అయినా ఏమ‌నుకోలేదు. తెలంగాణ గురించి మాట్లాడుతాడ‌ని, మ‌న జిల్లాను బాగు చేస్తాడ‌ని అనుకున్నాం కానీ అది జ‌ర‌గ‌లేదు అని రేవంత్ అన్నారు.

తెలంగాణ‌ను ధ‌నిక రాష్ట్రంగా అప్ప‌గించారు సోనియా

జూన్ 2న 2014న 60 ఏండ్లు క‌లలుక‌న్న రాష్ట్రాన్ని సోనియ‌మ్మ‌ ఇచ్చారు. ఇక తెలంగాణ‌లో ఏ బిడ్డ మ‌ర‌ణం చూడొద్దు, ఆడ‌బిడ్డ క‌డుపుకోత‌తో క‌న్న‌కొడుకును క‌ళ్ల ముందే తెల్ల‌తెల్ల‌వారుజామున క‌లాపి చ‌ల్లుతుంటే అంబులెన్స్‌లో శ‌వాలై వ‌స్తుందటే ఆ త‌ల్లుల దుఖాన్ని ఆపాల‌ని ఏపీలో పార్టీ చ‌చ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణ‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా రాజ‌కీయ స్వార్థ్యాన్ని వ‌దిలేసి 4 కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు సోనియాగాంధీ. తెలంగాణ‌ను ధ‌నిక రాష్ట్రంగా అప్ప‌గించారు సోనియా గాంధీ మ‌న‌కు అని సీఎం తెలిపారు.

మ‌న క‌ష్టాలు, క‌న్నీళ్లు త‌డువ‌లేదు..

తెలంగాణ ప్ర‌జ‌లు మేక‌వ‌న్నె పులిని గుర్తించ‌క, గొర్రె క‌సాయినోడిని న‌మ్మిన‌ట్టు రెండుసార్లు సీఎంగా గెలిపించారు. ప‌దేండ్లు 8 ల‌క్ష‌ల కోట్లు చేతికి వ‌స్తే పాల‌మూరు జిల్లాలో ఉన్న ఏ ప్రాజెక్టుల‌ను కూడా పూర్తి చేయ‌లేదు. నెహ్రూ ప్రాజెక్టుల నుంచి జ‌ల‌య‌జ్ఞంలో వైఎస్సార్ ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రాజెక్టుల వ‌ర‌కు ఒక్క‌టి కూడా పూర్తి చేయ‌లేదు. మ‌న క‌ష్టాలు, క‌న్నీళ్లు త‌డువ‌లేదు. సాగునీరు ద‌క్క‌లేదు.. తాగు నీరు రాలేదు అని కేసీఆర్‌పై రేవంత్ నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement