త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple | నంబ‌ర్ వ‌న్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్‌.. 14 ఏళ్ల త‌రువాత మళ్లీ మొద‌టి స్థానానికి..

Apple | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఎట్ట‌కేల‌కు స్మార్ట్ ఫోన్ విక్ర‌యాల్లో మ‌ళ్లీ నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని సొంతం చేసుకుంది. 14 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఇప్పుడే శాంసంగ్‌ను బీట్ చేసిన యాపిల్ స్మార్ట్ ఫోన్ విక్ర‌యాల్లో 2025లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించింది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ద్వారానే యాపిల్ మ‌రోమారు నంబ‌ర్ వ‌న్ స్థానానికి ఎగ‌బాకింది.

S

Business | Published On Jan 13, 2026, 10.39 am IST

Apple | నంబ‌ర్ వ‌న్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్‌.. 14 ఏళ్ల త‌రువాత మళ్లీ మొద‌టి స్థానానికి..
Advertisement

Apple | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఎట్ట‌కేల‌కు స్మార్ట్ ఫోన్ విక్ర‌యాల్లో మ‌ళ్లీ నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని సొంతం చేసుకుంది. 14 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఇప్పుడే శాంసంగ్‌ను బీట్ చేసిన యాపిల్ స్మార్ట్ ఫోన్ విక్ర‌యాల్లో 2025లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించింది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ద్వారానే యాపిల్ మ‌రోమారు నంబ‌ర్ వ‌న్ స్థానానికి ఎగ‌బాకింది. ఈ మేర‌కు కౌంట‌ర్ పాయింట్ రీసెర్చ్ ఓ నివేదిక‌లో వివరాల‌ను వెల్ల‌డించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 5 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల‌లో యాపిల్ గ‌తేడాది కాలంలో అత్య‌ధిక వృద్ధిని న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో యాపిల్‌కు చెందిన ఐఫోన్ వాటా 20 శాతంగా న‌మోదైంది. ఈ కార‌ణంగానే యాపిల్ మ‌ళ్లీ ఎన్నో ఏళ్ల త‌రువాత ఈ ఘ‌న‌త‌ను సాధించింది.

10 శాతం వృద్ధి రేటు..

నివేదిక చెబుతున్న ప్ర‌కారం ఈ సంవ‌త్స‌ర కాలంలో యాపిల్ 10 శాతం వృద్ధి రేటు సాధించ‌డం విశేషం. భార‌త్, జ‌పాన్‌, ఆగ్నేయాసియా త‌దిత‌ర మార్కెట్‌ల‌లో ఐఫోన్ 16 చాలా స‌క్సెస్ అయింది. యాపిల్ వృద్ధికి ఇది కూడా దోహ‌దం చేసింది. 2025 సెప్టెంబ‌ర్ నెల‌లో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల‌ను యాపిల్ ప్ర‌పంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్ర‌స్తుతం ఐఫోన్ల‌కు ప్ర‌పంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో 20 శాతం వాటా ఏర్ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లుగా చెబుతున్నారు. ఈ ఫోన్ల‌కు ఉన్న డిమాండ్‌తోపాటు గ‌ణ‌నీయ‌మైన స్థాయిలో అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం వ‌ల్లే యాపిల్ ఇంత‌టి వృద్ధి సాధించింద‌ని, ఐఫోన్ల‌కు అంత‌టి మార్కెట్ వాటా ల‌భించింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఐఫోన్ 16, 17 సిరీస్ ఫోన్ల వ‌ల్లే..

ఇక భార‌త్‌లో అత్య‌ధికంగా అమ్ముడైన ఐఫోన్ల‌లో ఐఫోన్ 16 ఇప్ప‌టికీ ప్ర‌థ‌మ స్థానంలో ఉండ‌గా, త్వ‌ర‌లోనే ఈ స్థానాన్ని ఐఫోన్ 17 ఆక్ర‌మిస్తుంద‌ని భావిస్తున్నారు. అలాగే 2025 చివ‌రి త్రైమాసికంలోనూ యాపిల్ అత్య‌ధిక వృద్ధిని న‌మోదు చేసింది. కాగా స్ర‌పంచ వ్యాప్తంగా గతేడాది కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2 శాతం పెరిగింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఐఫోన్ల‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లు తేలింది. అందువ‌ల్ల‌నే యాపిల్ అంత‌టి వృద్ధి సాధించింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ప్రీమియం ప‌రిక‌రాల డిమాండ్ పెరిగినా ఆ ప్ర‌భావం యాపిల్ పై అంతగా ప‌డ‌లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ అనంత‌రం యాపిల్ త‌న ఐఫోన్ మార్కెట్ వాటాను గ‌ణ‌నీయంగా పెంచుకుంటూ వ‌స్తుంద‌ని తేలింది.

శాంసంగ్ వృద్ధి రేటు 5 శాత‌మే..

కాగా ప్ర‌పంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో యాపిల్‌కు చెందిన ఐఫోన్ అనంత‌రం శాంసంగ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ ఆ మార్కెట్‌లో ఈ ఏడాది కాలంలో 19 శాతం వాటాను సాధించింది. శాంసంగ్ సంస్థ గ‌డిచిన ఏడాదిలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ప‌రంగా 5 శాతం మాత్ర‌మే వృద్ధిని న‌మోదు చేసింది. మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో రిలీజ్ అవుతున్న శాంసంగ్ ఫోన్ల‌నే వినియోగ‌దారులు ఎక్కువ‌గా కొంటున్నార‌ని, ఆ త‌రువాత ఆ కంపెనీకి చెందిన ఎస్ సిరీస్‌, జ‌డ్ సిరీస్ ఫోన్ల‌ను వినియోగ‌దారులు కొనుగోలు చేస్తున్నార‌ని, వీటి వ‌ల్లే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఆ మేర వృద్ధిని సాధించింద‌ని గ‌ణాంకాల ద్వారా వెల్ల‌డైంది. అయితే యాపిల్ తో పోలిస్తే శాంసంగ్ సంస్థ ఎక్కువ‌గా లాటిన్ అమెరికా, పశ్చిమ ఐరోపా, జ‌పాన్ వంటి దేశాల మార్కెట్ల‌లో వెనుకంజ‌లో ఉంద‌ని తేలింది. అందువ‌ల్లే యాపిల్‌కు ఈసారి ఆ మార్కెట్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానం ద‌క్కింద‌ని అంటున్నారు. అయితే భ‌విష్య‌త్తులో రిలీజ్ అయ్యే ఐఫోన్లు ఎలా ఉంటాయి, యాపిల్ రానున్న సంవ‌త్స‌రాల్లో ఈ స్థానంలో కొన‌సాగుతుందా.. అన్న వివ‌రాలు వేచి చూస్తే తెలుస్తాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement