FD Backed Credit Cards | ఎఫ్డీ ఆధారిత క్రెడిట్ కార్డులను తీసుకుంటే లాభమా.. నష్టమా..?
దేశంలో ఎఫ్‌డీ ఆధారిత క్రెడిట్ కార్డులు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)పై ఆధారపడి జారీ చేసే ఈ కార్డులు సంప్రదాయ క్రెడిట్ హిస్టరీ లేకుండానే క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవడానికి లేదా మెరుగుపరుచుకోవడానికి ఒక సులభ మార్గంగా చెప్పవచ్చు. ఈ విధానంలో ఎఫ్‌డీ కొలాటరల్‌గా పనిచేస్తుంది, అదే సమయంలో వడ్డీని కూడా అందిస్తుంది.
FD Backed Credit Cards | దేశంలో ఎఫ్‌డీ (FD) ఆధారిత క్రెడిట్ కార్డులు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)పై ఆధారపడి జారీ చేసే ఈ కార్డులు సంప్రదాయ క్రెడిట్ హిస్టరీ లేకుండానే క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవడానికి లేదా మెరుగుపరుచుకోవడానికి ఒక సులభ మార్గంగా చెప్పవచ్చు. ఈ విధానంలో ఎఫ్‌డీ కొలాటరల్‌గా పనిచేస్తుంది, అదే సమయంలో వడ్డీని కూడా అందిస్తుంది. సాధారణ క్రెడిట్ కార్డులకు అవసరమైన అర్హతలు ఆదాయం, వయస్సు, గత క్రెడిట్ హిస్టరీ వంటి ప్రమాణాలు సరిపోని వారికి ఈ కార్డులు అనుకూలంగా ఉంటాయి. అందుకే విద్యార్థులు, కెరీర్ ప్రారంభ దశలో ఉన్న యువ ఉద్యోగులు ఈ కార్డుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే బ్యాంకులు కనీస ఎఫ్‌డీ మొత్తం, వయస్సు పరిమితి వంటి కొన్ని నిబంధనలను విధిస్తాయి.
80 శాతం వరకు క్రెడిట్ లిమిట్..
ఈ కార్డులు ముఖ్యంగా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి లేదా కొత్తగా క్రెడిట్ ప్రయాణం ప్రారంభించేవారికి మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఎఫ్‌డీపై ఆధారపడి ఉండటం వల్ల బ్యాంకులకు రిస్క్ తక్కువగా ఉంటుంది, అందుకే సులభంగా జారీ చేస్తారు. అయితే క్రెడిట్ లిమిట్ ఎఫ్‌డీ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ కార్డులు ఎఫ్‌డీ మొత్తంలో 80 శాతం వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తాయి. వీటిని సాధారణ క్రెడిట్ కార్డుల మాదిరిగానే షాపింగ్, బిల్ పేమెంట్స్‌కు ఉపయోగించవచ్చు. ఖర్చు పరిమితి సొంత డబ్బుతో అనుసంధానమై ఉండటం వల్ల అధిక ఖర్చులను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఎఫ్‌డీపై వడ్డీ వస్తూ ఉండటం వల్ల సంపద కూడబెట్టే అవకాశం ఉంటుంది.
ఎఫ్డీ క్రెడిట్ కార్డులను ఇస్తున్న బ్యాంకులు ఇవే..
ఈ కార్డుల్లో కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎఫ్‌డీ మొత్తం లాక్ అయిపోతుంది. ప్రీమియం కార్డులతో పోలిస్తే రివార్డ్స్ తక్కువగా ఉంటాయి. బకాయిలు చెల్లించకపోతే అధిక వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అందువల్ల ఈ కార్డులు క్రెడిట్ ప్రారంభానికి అనుకూలమైనప్పటికీ, అనుభవం ఉన్న వినియోగదారులకు దీర్ఘకాలికంగా సరైన ఎంపిక కావు. అందువల్ల కొంతకాలం పాటు వాడేందుకు ఈ కార్డులు పనిచేస్తాయి. ఇక దేశంలో పలు బ్యాంకులు వివిధ ఫీచర్లతో ఎఫ్‌డీ ఆధారిత క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వాటిల్లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఎస్‌బీఎం, కోటక్, యాక్సిస్ బ్యాంకు వంటి బ్యాంకులు ఉన్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వావ్ అనే క్రెడిట్ కార్డును ఎఫ్‌డీ కొలాటర్‌తో అందిస్తోంది. కనీసం రూ.5వేలు ఎఫ్‌డీ చేస్తే ఈ కార్డును పొందవచ్చు. మొదటి సంవత్సరం ఉచితంగానే ఇస్తారు. తరువాత నుంచి ప్రతి ఏడాది రూ.499 ఫీజు ఉంటుంది. ఇక ఈ కార్డును యూపీఐ కార్డులా కూడా వాడుకోవచ్చు. అలా వాడితే క్యాష్ బ్యాక్ రివార్డులను ఇస్తారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం) కూడా క్రెడిలియో రుపే పేరిట ఎఫ్డీ ఆధారిత క్రెడిట్ కార్డును ఇస్తోంది. దీనికి ఎలాంటి వార్షిక ఫీజు లేదు. లైఫ్ టైమ్ ఫ్రీగా వాడుకోవచ్చు. లావాదేవీలపై 1 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఎఫ్‌డీ కనీసం రూ.5వేలు చేయాల్సి ఉంటుంది. కోటక్ మహీంద్రా 811 డ్రీమ్ డిఫరెంట్ పేరిట ఆ బ్యాంకు కనీస ఎఫ్డీ రూ.10వేలతో క్రెడిట్ కార్డును ఇస్తోంది. ఇది కూడా లైఫ్ టైమ్ ఫ్రీ ఆఫర్‌తో లభిస్తుంది. అలాగే ఆన్‌లైన్ షాపింగ్‌పై ఎక్కువ రివార్డులను ఇస్తుంది. యాక్సిస్ బ్యాంకు మై జోన్ ఈజీ, ప్రివిలెజ్ ఈజీ పేరిట రెండు రకాల ఎఫ్డీ ఆధారిత క్రెడిట్ కార్డులను ఇస్తోంది. మొదటి కార్డుకు కనీసం రూ.15వేలు ఎఫ్డీ చేయాలి. రెండో కార్డుకు కనీసం ఎఫ్డీ రూ.65వేలు ఉండాలి. మై జోన్ ఈజీ కార్డుకు వన్ టైమ్ ఫీజు రూ.500 ఉంటుంది. బేసిక్ రివార్డులను ఇస్తుంది. ప్రివిలెజ్ ఈజీ కార్డుకు ఫీజు రూ.1500 ఉంటుంది. 1 శాతం రివార్డులను అందిస్తుంది.
కొంత కాలం వాడొచ్చు..
ఎఫ్‌డీ ఆధారిత క్రెడిట్ కార్డులు ప్రారంభ స్థాయి వినియోగదారులకు మంచి ఆర్థిక సాధనంగా నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ స్కోర్ నిర్మాణానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే మంచి క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోరు నిర్మాణమైతే దీర్ఘకాలంలో అన్ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను తీసుకోవడమే మేలు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






