Harish Rao | అర్ధరాత్రి పూట జర్నలిస్టుల అరెస్టు అవసరమా..? డీజీపీకి హరీశ్‌రావు ఫోన్ కాల్
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టుల విషయమై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టుల విషయమై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్ళి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? ప్రొసీజర్ అనుసరించకుండా, నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారు? అని అడిగారు.
జర్నలిస్టులు ఏం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు. వారిపట్ల ఎందుకు అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. వాళ్ల కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయి, పండుగ పూట అరెస్టులు సరికాదు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
ఈ అరెస్టులను ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడిగా హరీశ్‌రావు అభివర్ణించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా, డిజిటల్ మీడియాపై కేసును విచారించేందుకు సిట్‌ను ఏర్పాటు చేసి, ఎవరిని కాపాడుతున్నారో, ఎవరిని వేటాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకుల స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గమని అన్నారు. "రేవంత్ రెడ్డీ.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ?" అని హరీశ్‌రావు విమర్శించారు.
[video width="832" height="464" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-14-at-11.07.25.mp4"][/video]
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



