త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Beatriz Toffenbach | వివాదంలో య‌శ్ టాక్సిక్ మూవీ.. ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసిన నటి..!

Beatriz Toffenbach | కేజీఎఫ్ స్టార్ య‌శ్ న‌టిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. ఇందులోని ఇంటిమేట్ సీన్స్ కార‌ణంగా మూవీ వివాదంలో చిక్కుకున్న‌ది.

P

Entertainment | Published On Jan 14, 2026, 1.38 pm IST

Beatriz Toffenbach | వివాదంలో య‌శ్ టాక్సిక్ మూవీ.. ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసిన నటి..!
Advertisement

Beatriz Toffenbach | కేజీఎఫ్ స్టార్ య‌శ్ న‌టిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. ఇందులోని ఇంటిమేట్ సీన్స్ కార‌ణంగా మూవీ వివాదంలో చిక్కుకున్న‌ది. ఓ న‌టితో య‌శ్ ఇంటిమేట్ సీన్స్‌లో క‌నిపించాడు. ఆ న‌టి ఎవ‌రో కాదు బీట్రిజ్ టోఫెన్ బాఖ్‌. వివాదం నేప‌థంలో న‌టి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాను డిలీట్ చేసింది.

టాక్సిక్ మూవీ టీజ‌ర్ విడుద‌లైన వెంట‌నే చాలామంది ఆ న‌టి ఎవ‌రో తెలుసుకునేందుకు తెగ ఆస‌క్తి చూపించారు. మొద‌ట అంద‌రూ న‌టాలీ బైర్న్ భావించారు. ఆ న‌టికి సంబంధించిన వివ‌రాల‌ను ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్‌దాస్ వెల్ల‌డించారు. బీట్రీజ్ బాఖ్‌గా తెలిపారు. ఆమె బ్రెజిలియ‌న్ మోడ‌ల్‌. ఆమె 2014లో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె గాయ‌ని, హాలీవుడ్ న‌టి కూడా. టీవీ సిరీస్ బ్రూక్లిన్ నైన్-నైన్‌తో గుర్తింపు పొందారు. డిస్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో బీట్రీజ్ క‌నిపించారు. మొన్న‌టి వ‌ర‌కు యాక్టివ్‌గా సోష‌ల్ మీడియాలో క‌నిపించిన బీట్రిజ్ ఒక్క‌సారిగా ఇన్‌స్టాను డిలీట్ చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టాక్సిక్ టీజ‌ర్ త‌ర్వాత ఇంటిమేట్ సీన్స్ వైర‌ల్ కావ‌డం, విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో బీట్రిజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించినట్లు సమాచారం. య‌శ్‌, బ్రీట్ మ‌ధ్య చిత్రీక‌రించిన సీన్స్‌పై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లుచోట్ల ఫిర్యాదులు వ‌చ్చాయి. క‌ర్నాట‌క సామాజిక కార్య‌క‌ర్త దినేశ్ క‌ల్ల‌హ‌ళ్లి టాక్సిక్స్ మూవీ టీజ‌ర్‌లోని కారు సీన్స్‌పై అభ్‌యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ (CBFC)కి ఫిర్యాదు చేశారు. అదే స‌మ‌యంలో క‌ర్నాట‌క మ‌హిళా క‌మిష‌న్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఎఫ్‌సీ స్పందించింది. మూవీని యూట్యూబ్‌లో విడుద‌ల చేసుకోవాల‌ని.. వాటికి స‌ర్టిఫికేట్ అవ‌స‌రం ఉండ‌ద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ది. ఈ మూవీని మార్చి 19న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement