లోడ్ అవుతోంది...


Komatireddy Venkat Reddy | త్రినేత్ర.న్యూస్ : మరో 20 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీలో సుమారు రూ. 25 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పాలమూరు గడ్డ బిడ్డనే. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలను వెనుకబాటు జిల్లాలు అని అంటారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌తో నరకయాతన అనుభవిస్తే.. పాలమూరు జిల్లా కరువుతో వెనుబడింది. ఈ వెనుకబడిన జిల్లాలను బంగారు జిల్లాలుగా మార్చే ప్రయత్నంలో సీఎం రేవంత్ ఉన్నారు అని మంత్రి తెలిపారు.
ఇప్పటికే కురుమూర్తి ఆలయానికి రూ.140 కోట్లతో ఘాట్ రోడ్డు మంజూరు చేశాం. దేవరకద్ర నియోజకవర్గంలో రూ.60 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేస్తున్నాం. దేవరకద్ర నియోజకవర్గం బంగారంగా మారాలంటే.. ప్రజలందరూ స్థానిక ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉండాలి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి చేసిన... 10 శాతం పనులు పూర్తి చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టుకు రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం ఎలా పూర్తవుతుంది.? ఇంకా అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు.? సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లలో ఏ ఒక్క రోజు విరామం తీసుకోకుండా పని చేస్తున్నారు. కేసీఆర్ సంవత్సరంలో ఎప్పుడో ఒక్కరోజు కనబడుతారు... రేవంత్ రెడ్డి రోజు ప్రజలకు కనపడతారు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam