Telangana | రాష్ట్రంలో ఇక వానలు లేనట్టే.. ఎండాకాలాన్ని తలపించేలా అక్టోబర్..!
Telangana | నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) సీజన్ ముగిసింది. ప్రస్తుతం రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్నది. దీంతో రుతుపవన సీజన్‌లోనే అంతంతగా కురిసిన వానలు.. ఇక అక్టోబర్‌లోనూ రాష్ట్రంలో (Telangana) వర్షాలు వచ్చే సూచనలు పెద్దగా లేవని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Telangana | త్రినేత్ర న్యూస్: నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) సీజన్ ముగిసింది. ప్రస్తుతం రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్నది. దీంతో రుతుపవన సీజన్‌లోనే అంతంతగా కురిసిన వానలు.. ఇక అక్టోబర్‌లోనూ రాష్ట్రంలో (Telangana) వర్షాలు వచ్చే సూచనలు పెద్దగా లేవని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. సాధారణం కంటే తక్కువ వర్షాతం (Lowest Rainfall) నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. దీనివల్ల సాధారణంగా చల్లబడాల్సిన అక్టోబర్ నెల ఈసారి ఎండకాలాన్ని తలపించే అవకాశముందని వెల్లడించింది. ఎల్ నినో (El Niño) ప్రభావం వల్ల అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పొడి వాతావరణమే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. సముద్రాల్లో చోటుచేసుకుంటున్న మార్పులతోనే ఈ పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. ఈ ఎల్ నినో పరిస్థితులు ఈ సంవత్సరాంతం వరకు మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, హిందూ మహాసముద్రంపై ప్రస్తుతం తటస్థ ఐఓడీ (Indian Ocean Dipole) పరిస్థితులు ఉన్నాయని, రాబోయే ఈశాన్య రుతుపవనాల కాలంలో కూడా ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అయితే అక్టోబర్ 4, 5 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే మొత్తంగా అక్టోబర్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంవెల్లడించింది. అంతేకాకుండా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగే శీతాకాలం ప్రారంభ సీజన్‌లో కూడా మొత్తం వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండవచ్చని తెలిపింది.
లోటు వర్షపాతం
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సజూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి 740.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. 615.5 మి.మీ. వర్షపాతమే నమోదైంది. నిర్మల్, యాదాద్రిభువనగిరి, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, వరంగల్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నల్లగొండ, హనుమకొండ, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ సారి తక్కువ వర్షపాతం కురిసింది. ఇందులో 8 జిల్లాల్లో 30 శాతం నుంచి 41 శాతం వరకు లోటు ఏర్పడింది.
సాధారణంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ వంటి ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో వార్షిక సగటు వర్షపాతం 1000 మి.మీ. పైనే ఉంటుంది. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు పడ్డాయి.
తాజావార్తలు
- ●Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి
- ●Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..
- ●Badam Ki Jali | హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?
- ●Congress | కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా
- ●Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల జోరు.. 5 శాతం జంప్..
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..

Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..

Badam Ki Jali | హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?

Congress | కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా





