త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel Recharge Plan Hike | యూజర్లకు షాక్‌ ఇచ్చిన ఎయిర్‌టెల్‌.. ఆ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధర రూ.999 పెంపు..!

Airtel Recharge Plan Hike | ప్రీపెయిడ్ వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్ భారీ షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ప్లాన్ ధరను ఏకంగా రూ.999 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా సుమారు 25 శాతం టారిఫ్ పెంచింది.

P

Business | Published On Feb 8, 2026, 12.30 pm IST

Airtel Recharge Plan Hike | యూజర్లకు షాక్‌ ఇచ్చిన ఎయిర్‌టెల్‌.. ఆ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధర రూ.999 పెంపు..!
Advertisement

Airtel Recharge Plan Hike | ప్రీపెయిడ్ వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్ భారీ షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ప్లాన్ ధరను ఏకంగా రూ.999 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా సుమారు 25 శాతం టారిఫ్ పెంచింది. ఇప్పటివరకు దశలవారీగా ప్లాన్ ధరలను సవరించిన ఎయిర్‌టెల్.. ఈ ఏడాదిలో ఇదే తొలి టారిఫ్ పెంపుగా భావిస్తున్నారు. మీరు కూడా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ అయితే, ఈ మరి ధర పెరిగిన ఆ ప్లాన్ ఏదో ఇప్పుడు చూద్దాం రండి..!

టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. ఎయిర్‌టెల్ తన గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ధరను రూ.4000 నుంచి రూ.4999కి పెంచింది. ఈ రూ.4999 గ్లోబల్ రోమింగ్ ప్యాక్ ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. విదేశాల్లో ఉపయోగించేందుకు ఇందులో 5జీబీ డేటా, భారత్‌కు, స్థానిక కాల్స్‌కు కలిపి 100 నిమిషాల ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, అలాగే 100 అవుట్‌గోయింగ్ ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అంతర్జాతీయ రోమింగ్‌లో ఉన్న సమయంలో ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్‌లు పూర్తిగా ఉచితం. ఈ ప్యాక్‌తో భారత్‌లో ఉన్నప్పుడు కూడా మంచి ప్రయోజనాలు యూజర్లకు లభిస్తాయి. రోజుకు 1.5జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకునే అవకాశం ఉంటుంది.

ఈ రీచార్జ్ చేసిన వెంటనే ఇంటర్నేషనల్ రోమింగ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ప్లాన్ గడువు ముగిసిన తర్వాత డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు పూర్తిగా బ్లాక్ అవుతాయని, ఇది వర్తించే నిబంధనలకు లోబడి ఉంటుందని ఎయిర్‌టెల్ స్పష్టం చేస్తోంది. ఈ ధర పెంపుపై ఎయిర్‌టెల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, 5జీ విస్తరణ, ఏఐ ఆధారిత నెట్‌వర్క్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్స్ కోసం టెలికాం సంస్థలు సేవల మానిటైజేషన్‌పై దృష్టి పెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పెంపు పరిశ్రమ ట్రెండ్‌కి అనుగుణంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తానికి, అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ ధర పెంపు కొంత భారం అయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్లాన్లపై కూడా టారిఫ్ మార్పులు జరిగే అవకాశం ఉందని టెలికాం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement
Advertisement