త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

6th Jan 2026 Gold And Silver Rates | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ప‌రుగు ఆగ‌డం లేదు..

6th Jan 2026 Gold And Silver Rates | అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో నెల‌కొన్న ఉద్రిక్త వాతావ‌ర‌ణం కార‌ణంగా గత ఏడాదిలోనే బంగారం, వెండి ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. ఈ మ‌ధ్య కాలంలోనే ఈ రెండు లోహాల ధ‌రలు ఎన్నో రెట్లు పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. ఇక తాజాగా వెనెజువెలా అధ్య‌క్షుడు నికోలాస్ మ‌దురోను అమెరికా బంధించడంతో ఆ ప్ర‌భావం కూడా వాటి ధ‌ర‌ల‌పై ప‌డింది.

S

Business | Published On Jan 6, 2026, 12.18 pm IST

6th Jan 2026 Gold And Silver Rates | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ప‌రుగు ఆగ‌డం లేదు..
Advertisement

6th Jan 2026 Gold And Silver Rates | అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో నెల‌కొన్న ఉద్రిక్త వాతావ‌ర‌ణం కార‌ణంగా గత ఏడాదిలోనే బంగారం, వెండి ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. ఈ మ‌ధ్య కాలంలోనే ఈ రెండు లోహాల ధ‌రలు ఎన్నో రెట్లు పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. ఇక తాజాగా వెనెజువెలా అధ్య‌క్షుడు నికోలాస్ మ‌దురోను అమెరికా బంధించడంతో ఆ ప్ర‌భావం కూడా వాటి ధ‌ర‌ల‌పై ప‌డింది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌ల్లో గ‌త వారంతో పోలిస్తే దాదాపుగా 0.33 శాతం వ‌ర‌కు పెరుగుద‌ల క‌నిపించింది. మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్‌ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో ఫిబ్ర‌వ‌రి గోల్డ్ ఫ్యూచ‌ర్స్ 10 గ్రాముల ధ‌ర ప్ర‌స్తుతం రూ.1,38,578 వద్ద కొన‌సాగుతోంది. గ‌త వారంతో పోలిస్తే ఇందులో 0.33 శాతం పెరుగుల న‌మోదు చేసుకుంది. అలాగే ఎంసీఎక్స్‌లో వెండి మార్చి ఫ్యూచ‌ర్స్ 1 కిలో ధ‌ర రూ.2,49,251 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, ఇందులో రూ.3096 మేర మొత్తం 1.26 శాతం పెరుగుద‌ల చోటు చేసుకుంది.

బంగారంలో ట్రేడింగ్ చేస్తున్న‌వారు ఫ్యూచర్స్ ధ‌ర రూ.1,37,400 ఉన్న‌ప్పుడు కొనుగోలు చేయాల‌ని, రూ.1,36,600 టార్గెట్ పెట్టుకుని అమ్మాల‌ని విశ్లేష‌కులు సూచించారు. స్టాప్ లాస్‌ను రూ.1,35,800 వ‌ద్ద చెప్పారు. రూ.1,38,800, రూ.1,39,500 టార్గెట్ల‌ను కూడా పెట్టుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఇక వెండి విష‌యానికి వ‌స్తే వెండి ఫ్యూచ‌ర్స్ ధ‌ర రూ.2,42,000 నుంచి రూ.2,38,000 మ‌ధ్య ఉన్న‌ప్పుడు కొనాల‌ని, స్టాప్ లాస్ రూ.2,32,000గా పెట్టుకోవాల‌ని తెలిపారు. టార్గెట్ల‌ను రూ.2,48,000, రూ.2,52,000కు నిర్దేశించుకోవాల‌ని సూచించారు.

కాగా దేశీయ మార్కెట్ల‌లో భౌతిక బంగారం విలువ మంగ‌ళ‌వారం ఇలా ఉంది. హైద‌రాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1,38,820 ఉండ‌గా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1,27,250గా ఉంది. అలాగే కేజీ వెండి ధ‌ర రూ.2,71,000గా ఉంది. సోమ‌వారంతో పోలిస్తే మంగ‌ళ‌వారం బంగారం ధ‌ర రూ.600 వ‌ర‌కు పెర‌గ్గా, వెండి ధ‌ర రూ.6వేలు పెరిగింది.

Advertisement

తాజావార్తలు

Advertisement