త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Coronavirus | హైద‌రాబాద్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. తార్నాక‌లో మ‌హిళ మృతి

Coronavirus | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రోసారి క‌రోనా( Coronavirus ) క‌ల‌క‌లం సృష్టిస్తోంది. నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు పొరుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని విన్నాం. కానీ తాజాగా హైద‌రాబాద్‌( Hyderabad )లో క‌రోనాతో ఓ మ‌హిళ మృతి చెంద‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

S

Hyderabad | Published On Jul 22, 2026, 1.42 pm IST

Coronavirus | హైద‌రాబాద్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. తార్నాక‌లో మ‌హిళ మృతి
Advertisement

Coronavirus | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు పొరుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని విన్నాం. కానీ తాజాగా హైద‌రాబాద్‌లో క‌రోనాతో ఓ మ‌హిళ మృతి చెంద‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

తార్నాక‌కు చెందిన ఓ మ‌హిళ‌(38) గ‌త నెల‌లో ద‌గ్గు, జ్వ‌రం, జ‌లుబుతో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రికి వెళ్లింది. అక్క‌డ సిటీ స్కాన్ చేయ‌గా ఊపిరితిత్తులు దెబ్బ‌తిన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం కార్పొరేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, కొద్ది గంట‌ల్లోనే ప్రాణాలు విడిచారు. త‌ద‌నంత‌రం ఆమె మెడిక‌ల్ రిపోర్టుల‌ను ఓ ప్ర‌భుత్వ వైద్యుడికి చూపించ‌గా, కొవిడ్‌తోనే మ‌ర‌ణించిన‌ట్లు ఆయ‌న నిర్ధారించారు.

గ‌త నెల‌లో గాంధీ ఆస్ప‌త్రిలో ఓ క‌రోనా కేసు న‌మోదైంది. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికీ కొవిడ్‌తో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై టెస్టుల సంఖ్య‌ను పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారికి టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చినవారిని ఐసోషలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement