TTD | శ్రీవారి ముడుపు పత్రం.. కొత్త పథకానికి ఆమోదం తెలిపిన టీటీడీ బోర్డు..!
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌కు మంజూరు ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అన్నమయ్య భవనంలో ఈవో ఎం రవిచంద్రతో కలిసి నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలను వివరించారు.
P
Andhra pradesh | Published On Feb 28, 2026, 8.10 pm IST
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌కు మంజూరు ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అన్నమయ్య భవనంలో ఈవో ఎం రవిచంద్రతో కలిసి నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలను వివరించారు.
నిర్ణయాలు..
- టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన వసతుల కోసం రూ.118.89 కోట్లు కేటాయింపు. డిజిటల్ క్లాస్‌రూములు, అదనపు హాస్టళ్లు, వంటగదుల ఆధునికీకరణకు ఆమోదం.
- భక్తుల సౌలభ్యం కోసం “శ్రీవారి ముడుపు పత్రం పథకం”ను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు నిర్ణయం. యూపీఐ చెల్లింపుల ద్వారా ముడుపు పత్రాలు అందించి హుండీలో సమర్పించే విధానం అమలు.
- తిరుమలలో అదనంగా అన్నప్రసాద భవనం, ఆధునిక వంటశాల నిర్మాణానికి రిలయన్స్ సంస్థ రూ.100–120 కోట్ల విరాళంతో పనులకు గ్రీన్ సిగ్నల్.
- శ్రీవాణి ట్రస్ట్ మార్గదర్శకాల్లో మార్పులకు ఆమోదం.
- ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం కోసం రూ.20.17 కోట్లతో డ్రై ఐలాండ్ నిర్మాణానికి అనుమతి.
- కోయంబత్తూర్, గువహటి, బెలగావి, పాట్నా సమీప మోకామాలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కేటాయించిన భూములను స్వీకరించేందుకు ఆమోదం.
- వకుళమాత ఆలయంలో “అక్షర గోవిందం” కార్యక్రమం ప్రారంభానికి నిర్ణయం.
- ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులకు అదనంగా రూ.50 విలువైన లడ్డూ ప్రసాదం ఉచితంగా అందించనున్నారు.
- బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.4.25 కోట్లతో విద్యుత్ అలంకరణలు, ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు.
- భద్రత బలోపేతానికి తిరుమల, తిరుపతిలో 727 మంది సిబ్బంది నియామకానికి ఆమోదం. అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు.
- గోశాలలు, ఇంక్యూబేషన్ సెంటర్ అభివృద్ధికి రూ.11.28 కోట్లు.
- 51 మంది పరిచారకులకు అర్చకులుగా పదోన్నతి అంశాన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు నిర్ణయం.
- పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ వేంకటేశ్వర దివ్య క్షేత్ర నిర్మాణానికి రూ.14.25 కోట్లు.
- టీటీడీ ఆలయాలు, వసతి సముదాయాల భద్రత పర్యవేక్షణకు తిరుపతిలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



