TTD | తిరుమల వెంకన్నకు రూ.2.5 కోట్ల విరాళం అందజేసిన హైదరాబాద్ బిల్డర్
TTD | హైదరాబాద్‌కు చెందిన పీఎల్‌రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ (PLRaju Constructions Limited) శ్రీవారికి చెందిన వివిధ ట్రస్ట్‌లకు రూ.2.5 కోట్ల విరాళం అందజేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి రాజగోపాలరాజు సంబంధిత పత్రాలను తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ (TTD) అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరికి అందజేశారు.
Andhra pradesh | Published On Jan 23, 2026, 5.51 pm IST
TTD | త్రినేత్ర.న్యూస్ : తిరుమల వేంకటేశ్వరస్వామికి హైదరాబాద్‌కు చెందిన ఒక బిల్డర్ రూ.2.5 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. నగరానికి చెందిన పీఎల్‌రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ (PLRaju Constructions Limited) శ్రీవారికి చెందిన వివిధ ట్రస్ట్‌లకు ఈ విరాళాలను అందజేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి రాజగోపాలరాజు సంబంధిత పత్రాలను తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ (TTD) అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి, టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
మొత్తం విరాళంలో శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.75 లక్షలు, శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు రూ.75 లక్షలు, శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (బర్డ్) ట్రస్ట్‌కు రూ.25 లక్షలు, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.25 లక్షల చొప్పున విరాళాలు అందజేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






