త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala | తిరుమ‌లలో దారుణం.. కంపార్ట్‌మెంట్‌లో భ‌క్తురాలికి మ‌త్తుమందిచ్చి బంగారు గొలుసు చోరీ

Tirumala | తిరుమ‌ల‌లో (Tirumala) దారుణం చోటుచేసుకున్న‌ది. శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి వెళ్తున్న వృద్ధురాలికి మ‌త్తుమందు ఇచ్చిన ఓ మ‌హిళ‌.. ఆమె తాళిబొట్టు చేరీ చేసింది.

G

Andhra pradesh | Published On Jan 11, 2026, 10.52 am IST

Tirumala | తిరుమ‌లలో దారుణం.. కంపార్ట్‌మెంట్‌లో భ‌క్తురాలికి మ‌త్తుమందిచ్చి బంగారు గొలుసు చోరీ
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తిరుమ‌ల‌లో (Tirumala) దారుణం చోటుచేసుకున్న‌ది. శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి వెళ్తున్న వృద్ధురాలికి మ‌త్తుమందు ఇచ్చిన ఓ మ‌హిళ‌.. ఆమె తాళిబొట్టు చేరీ చేసింది. తిరుప‌తిలోని పాత మున్సిప‌ల్ కార్యాల‌యం వెనుక నివ‌సిస్తున్న తిరుప‌తి రాధాకృష్ణ విజ‌య (63) శ్రీవారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం ఈ నెల 2న తిరుమ‌ల‌కు వెళ్లారు. అక్క‌డ స‌ర్వ‌ద‌ర్శ‌నం క్యూలైన్‌లో వేచిఉన్నారు. ఈ క్ర‌మంలో క‌ర్ణాట‌క‌లోని కోలారు జిల్లా క‌ప్ప‌ల్లి గ్రామానికి చెందిన నాగిశెట్టి నాగ‌ర‌త్న‌మ్మ‌.. తోటి భ‌క్తురాలిగా ఆ వృద్ధురాలితో ప‌రిచ‌యం చేసుకున్న‌ది.

మ‌రుస‌టి రోజు అంటే ఈ నెల 3న ఉద‌యం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్ నంబ‌ర్ 20లో ఆమె వేచిఉండ‌గా అక్క‌డికి వ‌చ్చిన నాగ‌ర‌త్న‌మ్మ‌.. ఆమెకు మ‌త్తు మాత్ర‌ను క‌లిపిన పాలు ఇచ్చింది. దీంతో వృద్ధురాలు మ‌త్తులోకి జారుకున్న‌ది. అనంత‌రం ఆమె మెడ‌లోని 60 గ్రాముల బంగారు తాళిబొట్టును చోరీ చేసి ప‌రారైంది. మెల‌కువ వ‌చ్చిన త‌ర్వాత త‌న మెడ‌లో తాళి లేక‌పోవ‌డంతో అవాక్క‌వ‌డం ఆమె వంతు అయింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదుచేసిన తిరుమ‌ల వ‌న్ టౌన్ పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. శ‌నివారం ఆమెను హెచ్‌టీ కాంప్లెక్స్ బాత్రూంల స‌మీపంలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి బంగారు తాళిబొట్టును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement