త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nepali Gang | హైద‌రాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్.. వృద్ధ దంప‌తుల‌ను క‌ట్టేసి భారీ దోపిడీ

Nepali Gang | హైద‌రాబాద్‌లో (Hyderabad) వ‌రుస దొంగ‌త‌నాల‌తో నేపాలీ గ్యాంగ్ (Nepali Gang) హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్యను నేపాలీ ముఠా హత్య చేసిన కేసు దర్యాప్తులో ఉండగానే.. మ‌రో ఘ‌ట‌న జవహర్‌నగర్‌లోని (Jawahar Nagar) కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో జ‌రిగింది. 

G

Hyderabad | Published On May 13, 2026, 9.14 am IST

Nepali Gang | హైద‌రాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్.. వృద్ధ దంప‌తుల‌ను క‌ట్టేసి భారీ దోపిడీ
Advertisement

Nepali Gang | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) వ‌రుస దొంగ‌త‌నాల‌తో నేపాలీ గ్యాంగ్ (Nepali Gang) హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. నేర‌స్తుల‌ను ప‌ట్టుకోవ‌డంలో దేశ వ్యాప్తంగా పేరున్న న‌గ‌ర పోలీసుల‌కే స‌వాల్ విసురుతున్నారు. జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్యను నేపాలీ ముఠా హత్య చేసిన కేసు దర్యాప్తులో ఉండగానే.. మ‌రో ఘ‌ట‌న జవహర్‌నగర్‌లోని (Jawahar Nagar) కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో జ‌రిగింది.

విశ్రాంత‌ ప్రొఫెసర్‌ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. కొంత‌కాలం క్రితం వారింట్లో ఓ నేపాలీ జంట ప‌నిలో చేరారు. న‌మ్మ‌కంగా ప‌నిచేస్తూ న‌మ్మకం పెంచుకున్నారు. ఇటీవ‌ల త‌మ‌ బంధువు అంటూ మ‌రో మ‌హిళ‌ను ఇంటికి తీసుకొచ్చారు. సోమ‌వారం రాత్రి (మే 11న‌) నేపాలీ మ‌హిళ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఇంట్లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారి బంధువులంటూ మ‌రో ముగ్గురూ వారి ఇంటికి వ‌చ్చారు. కేక్ క‌ట్‌చేసిన అనంత‌రం.. ప్రొఫెస‌ర్ దంప‌తుల‌ను బెదిరించి చేతులు క‌ట్టేశారు. భ‌యాందోళ‌ల‌నల‌కు గురైన వారు త‌మ‌ను ఏమీ చేయొద్ద‌ని, మీకు ఏం కావాలో తీసుకెళ్లాల‌ని చెప్పారు. దీంతో ఇంట్లో 60 తులాల బంగారం, వెండితోపాటు రూ.30 వేల నగదును దోచుకున్నారు.

అనంత‌రం మ‌త్తు మందు క‌లిపిన ప‌దార్థాల‌ను వారికి ఇచ్చి గ‌దిలో బంధించారు. సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేసి, ఇంట్లోని అన్ని గేట్లకు తాళాలు వేసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. మంగళవారం మధ్యాహ్నం మత్తు నుంచి తేరుకున్న ఆ వృద్ధ దంపతులు గట్టిగా కిటికిలో నుంచి అరవడంతో.. స్థానికులు ఆ ఇంటి తలుపులు తీశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ దోపిడీలో ఏడుగురు పాల్గొన్నారని పోలీసులు చెప్పారు. కాలనీలోని సీసీ టీవీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిశామ‌న్నారు.

Advertisement
Advertisement