త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కుట్ర‌లు: జ‌గ్గారెడ్డి

Jagga Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్‌ (Vizag Steel Plant) పై రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి కేంద్రం కుట్ర‌లు చేస్తోంద‌ని కాంగ్రెస్ (Congress) నాయ‌కుడు జ‌గ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. ప్ర‌ధాని మోడీతో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, జ‌గ‌న్‌ల‌కు స్నేహ‌మున్నా ప్రైవేటీక‌ర‌ణ ఎందుకు ఆగ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

A

Visakhapatnam | Published On Dec 27, 2025, 2.42 pm IST

Jagga Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కుట్ర‌లు: జ‌గ్గారెడ్డి
Advertisement

Jagga Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్‌ (Vizag Steel Plant) పై రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి కేంద్రం కుట్ర‌లు చేస్తోంద‌ని కాంగ్రెస్ (Congress) నాయ‌కుడు జ‌గ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. విజ‌య‌వాడ‌ (Vijayawada)లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ల‌కు దోస్తీ ఉంద‌ని అన్నారు. అయినా ప్రైవేటీక‌ర‌ణ‌ను ఎందుకు ఆప‌డం లేద‌ని ప్రశ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాల‌కులు మారినా స్టీల్ ప్లాంటు ప్రైవేటీక‌ర‌ణ‌ను మాత్రం ఆప‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు. స్టీల్ ప్లాంట్‌పై మాట‌మార్చిన బాబు, జ‌గ‌న్‌ల‌కు మాట్లాడే అర్హ‌త లేద‌ని మండిపడ్డారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎవ‌రూ బ‌హిరంగంగా విభ‌జ‌న వ‌ద్ద‌ని అన‌ని స‌మ‌యంలోనే తాను విభ‌జ‌న చేయ‌కూడ‌ద‌ని మాట్లాడాన‌ని గుర్తు చేశారు. త‌న‌కు ఏపీ అభివృద్ధి కూడా ముఖ్య‌మేన‌ని చెప్పారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement