Abortion Pills | ఐదునెలల పరిచయం.. యువకుడితో లైంగిక సంబంధం.. గర్భనిరోధక మాత్రలు వికటించి యువతి మృతి
Abortion Pills | ఆమె ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పనిచేస్తున్నది. స్నేహితుడి ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు లైంగికంగా దగ్గరయ్యారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. దానిని తొలగించేందుకు గర్భనిరోధక మాత్రలు (Abortion Pills) వాడాలని సూచించాడు.
Andhra pradesh | Published On Sep 16, 2026, 10.41 am IST
Abortion Pills | త్రినేత్ర.న్యూస్: ఆమె ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పనిచేస్తున్నది. స్నేహితుడి ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు లైంగికంగా దగ్గరయ్యారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. దానిని తొలగించేందుకు గర్భనిరోధక మాత్రలు (Abortion Pills) వాడాలని సూచించాడు. దీంతో మందులు వేసుకున్న ఆమె.. వికటించడంతో మృతిచెందింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి (Rajahmundry) చెందిన యువతి (30) కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో 6 నెలలుగా పనిచేస్తున్నది. సర్దార్ పటేల్‌నగర్‌లోని ఓ వసతి గృహంలో ఉంటున్నది. ఆమె స్నేహితుడు వెంకట్ ద్వారా అక్కడే ఉంటే కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలానికి చెందిన ఆరెపు నాగసాయి (26) పరిచమయ్యాడు. అతనికి వివాహమై ఒక పాప కూడా ఉంది.
ఐదు నెలల క్రితం ఏర్పడిన పరిచయం లైంగిక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. విషయం నాగసాయికి చెప్పడంతో గర్భంతీయించుకోవాలని చెప్పాడు. ఆమె గర్భనిరోధక మాత్రలు (Contraceptive Pills) వేశాడు. అవి వికటించడంతో.. హాస్టల్‌లోని సహచరులు ఆమెను గత నెల 26న నిజాంపేట రోడ్డులోని ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. అదే నెల 27న యువతి మామ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నగరంలో వైద్యం భారమవుతుండటంతో సెప్టెంబర్ 1 కాకినాడలోని (Kakinada) ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈ నెల 14న యువతి మృతిచెందినట్లు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందింది. మరోవైపు సెప్టెంబర్ 9న నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
- ●Kunamneni Sambasiva Rao | 22A ద్వారా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టడం అవాస్తవం
- ●Helicopter Crash | బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కూలిపోయిన మీడియా హెలికాప్టర్
- ●Jio | జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏడాది పాటు కాన్వా ప్రొ ఉచితం..
- ●Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల
- ●Bhatti Vikramarka | విద్యుత్ పొదుపే మరో పవర్ ప్లాంట్
- ●Telangana Congress | ఈ నెల 18న తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి..!

Kunamneni Sambasiva Rao | 22A ద్వారా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టడం అవాస్తవం

Helicopter Crash | బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కూలిపోయిన మీడియా హెలికాప్టర్

Jio | జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏడాది పాటు కాన్వా ప్రొ ఉచితం..

Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల






