Guava Cultivation | జామ కాయల సాగు.. ఏడాదికి రూ. 50 లక్షల ఆదాయం.. ఇది ఒడిశా రైతు విజయగాథ
Guava Cultivation | రైతులు( Farmers ) పంటలు పండించేది ఆదాయం కోసం. పెట్టుబడి ఖర్చులు పోనూ.. పది పైసలు వెనుకేసుకోవాలని అనుకుంటారు. అందుకోసం వినూత్న పద్ధతుల్లో సాగు చేస్తుంటారు. అధిక దిగుబడి సాధించే పంటలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఆ మాదిరి ఒడిశా( Odisha )కు చెందిన ఓ రైతు.. జామ సాగు( Guava Cultivation ) చేస్తూ భారీగా లాభాలు గడిస్తున్నాడు. జామ పండ్లను విక్రయిస్తూ ఏడాదికి రూ. 50 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాడు. మరి ఆ రైతు విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Agriculture | Published On Feb 22, 2026, 5.11 pm IST
Guava Cultivation | ఒడిశా( Odisha ) సంబల్‌పూర్ జిల్లాలోని బదుపాలి గ్రామానికి చెందిన రైతు బిర్ కిశోర్ బిస్వాల్( Bir Kishore Biswal )(56)కు రెండు ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో జామ సాగు( Guava Cultivation ) చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అధిక దిగుబడి వచ్చే జామ మొక్కలనే నాటాలని సంకల్పించాడు. ఈ క్రమంలో దేశీయ వీఎన్ఆర్ రకం, థాయ్ పింక్, థాయ్-7, థాయ్ సూపర్ కిరణ్, ప్రీమియం జపనీస్ బ్లాక్ డైమండ్ వంటి విదేశీ జాతుల జామ మొక్కలను తన పొలంలో నాటారు. 2021లో తొలి పంట చేతికి అందింది.

ఒక్కో జామ కాయ బరువు 700 గ్రాములు..
తన రెండెకరాల పొలంలో.. మొత్తం జామ మొక్కలనే సాగు చేశాడు రైతు కిశోర్ బిస్వాల్. థాయ్ రకం జామ మొక్కలను రూ. 250 చొప్పున, జపనీస్ బ్లాక్ డైమండ్ జామ మొక్కను రూ. 4500లకు కొనుగోలు చేశాడు. మొత్తంగా పెట్టుబడి కోసం రూ. 14 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. ఇక ఈయన తోటలోని ఒక్కో జామ చెట్టు ఏడాదికి 60 కేజీల జామకాయలను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కో జామ కాయ బరువు వచ్చేసి 700 గ్రాముల నుంచి కేజీన్నర వరకు ఉంటుంది. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఈ జామకాయలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కిలో జామకాయల ధర రూ. 120 నుంచి రూ. 250 వరకు విక్రయిస్తున్నాడు కిశోర్ బిస్వాల్.
జామ సాగుకు యూట్యూబే ఆధారమైంది..
జామ సాగు కోసం ఎలాంటి శిక్షణ పొందలేదు. యూట్యూబ్‌లో జామసాగు వీడియోలను చూసి మెళకువలు నేర్చుకున్నాను. అంటుకట్టడం, ఆకు కత్తిరింపు, పండ్ల సంచులను కట్టడం వంటి పద్ధుతులన్నీ యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను. ఇక సేంద్రీయ పద్ధతుల్లోనే జామ కాయలను పండించాలనుకున్నాను. ఇందుకోసం బెల్లం, శనగ పిండి, పెరుగు, చెట్ల కింద నుంచి సేకరించిన మట్టి, ఆవు పేడను ఉపయోగించి బయో కంపోస్ట్, సేంద్రీయ ఎరువును తయారు చేసి వినియోగించినట్లు రైతు కిశోర్ బిస్వాల్ తెలిపారు.

ఏడు కుటుంబాలకు ఉపాధి..
జామ సాగు ద్వారా కిశోర్ కుటుంబం లబ్ధి పొందడమే కాకుండా మరో ఏడు కుటుంబాలకు ఉపాధి లభించింది. ఈ ఏడు కుటుంబాలు నిరంతరం తోట పనుల్లోనే నిమగ్నమవుతున్నారు. కిశోర్‌కు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఆయన విజయానికి, లాభాలకు కారణమవుతున్నారు. ఈ చెట్లు ఏడాది పొడవునా కాయలు కాస్తుండడంతో ఏడాదంతా పని లభిస్తుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఏడాదికి రూ. 50 లక్షల ఆదాయం..
గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న కిశోర్ తొలుత 20 ఎకరాల్లో టమాటా సాగు చేశాడు. తొలి 30 ఏళ్లు తన పొలంలో టమాటా సాగు చేశాడు. అయితే ఆ పంటలో ఆశించి మేర లాభాలు రాలేదు. ఆ తర్వాత రసాయన మందులతో వ్యవసాయం మానేశాడు. సేంద్రీయ పద్ధతి వైపునకు మొగ్గు చూపాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా జామసాగును చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నాడు. ఏడాదికి రూ. 50 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
ఆగస్టు 19, 2026

Mushroom Farming | 14 ఏళ్ల ఐటీ కెరీర్‌ను వదిలి.. వ్యవసాయంవైపు అడుగులు.. కట్ చేస్తూ పుట్టగొడుగుల వ్యాపారంతో నెలకు రూ.10 లక్షల లాభం
ఆగస్టు 17, 2026

CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



