Sustainable agriculture | వ్యర్థాల నుంచి సుస్థిర వ్యవసాయానికి దారి చూపిన 11వ తరగతి విద్యార్థి
మానవ మూత్రం, బూడిద, వరి గడ్డితో పూర్తిగా సేంద్రీయ ఎరువు తయారు చేసిన 11వ తరగతి విద్యార్థి ఆలమ్ వీర్ జిందాల్. పంట దిగుబడి పెంపు, కాలుష్య నియంత్రణ, తక్కువ ఖర్చుతో సుస్థిర వ్యవసాయానికి మార్గం చూపిన ఈ బాలుడి ఆవిష్కరణకు జాతీయ స్థాయి ప్రశంసలు దక్కాయి.
Agriculture | Published On Dec 19, 2025, 12.40 pm IST
Class 11 Student Turns Waste into eco-friendly Fertilizer with Sustainable Farming Innovation
(త్రినేత్ర వ్యవసాయం డెస్క్)
Sustainable agriculture | భారత వ్యవసాయం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పెరుగుతున్న ఖర్చులు, మట్టిలో పోషకాల తగ్గుదల, కాలుష్యం పాత్రలే ఎక్కువ. వీటన్నింటికీ ఒకే పరిష్కారం చూపించేలా 11వ తరగతి విద్యార్థి ఆలమ్ వీర్ జిందాల్ చేసిన వైవిధ్యభరితమైన ఆవిష్కరణ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా వ్యర్థాలుగా భావించే మానవ మూత్రం, కట్టెలు లేదా మొక్కల బూడిద, వరి గడ్డి వంటి పదార్థాలతో ఆయన రూపొందించిన “ఈకో-ఫ్రెండ్లీ యూరిన్ వుడ్ యాష్ ఫర్టిలైజర్(Eco-Friendly Urine-ash Fertilizer)” పూర్తిగా సేంద్రీయ ఎరువుగా మారింది. ఈ ఎరువు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి కీలక పోషకాలతో సమృద్ధిగా ఉండటమే కాకుండా సహజ పురుగుమందులా కూడా పనిచేస్తోంది. పంట దిగుబడిని మూడు నుంచి నాలుగు రెట్లు పెంచడమే కాకుండా, మొక్కల్లోకి క్యాన్సర్‌కు కారణమయ్యే ఆర్సెనిక్ శోషణను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని పరీక్షల్లో తేలింది. అంతేకాదు, నీటి వినియోగాన్ని తగ్గించి గాలి-నీరు-మట్టి కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా ఇది కీలకంగా సహాయపడుతోంది. తక్కువ ఖర్చుతో, ఎక్కడైనా తయారు చేసుకునే వీలుండటంతో రైతులకు ఇది ఎంతో అందుబాటులో ఉండే పరిష్కారంగా మారుతోంది.
సీడ్ ‘పీ-బ్యాగ్స్’తో రోడ్లపక్కన స్వయంగా పెరిగే మొక్కలు
ఇదే ఆలోచనను మరింత విస్తరించిన ఆలమ్ వీర్, “సెల్ఫ్-గ్రోయింగ్ సీడ్ పీ-బ్యాగ్స్(Self-Growing Seed Pee-Bags,)” అనే వినూత్న పద్ధతిని కూడా అభివృద్ధి చేశాడు. ఈ విధానంలో నాటిన మొక్కలకు తరచూ నీరు పోయాల్సిన అవసరం లేకుండా, అదనపు ఎరువులు వాడకుండానే దీర్ఘకాలం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోడ్లపక్కన, పాడుబడిన ప్రదేశాల్లో హరితావరణం పెంచడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఈ ఆవిష్కరణల ద్వారా భారత్ విదేశాల నుంచి ఎరువులు, పురుగుమందులు దిగుమతి చేసుకోవడంపై ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయలను ఆదా చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆలమ్ వీర్ జిండాల్ చేసిన ఈ అసాధారణ కృషికి చండీగఢ్‌లోని ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) ప్రాంగణంలో నిర్వహించిన రాజ్యస్థాయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శనలో జాతీయ గుర్తింపు లభించింది. 116 పాఠశాలల నుంచి వచ్చిన 556 నమూనాల మధ్య “సుస్థిర వ్యవసాయం” థీమ్‌లో మొదటి బహుమతి సాధించడం ద్వారా, యువత ఆలోచనలు దేశ భవిష్యత్తును ఎలా మార్చగలవో ఆ అబ్బాయి నిరూపించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kancha Gachibowli | హెచ్‌సీయూ భూముల్లో మళ్లీ బుల్డోజర్..? హైదరాబాద్ ఊపిరితిత్తులపై దాడి..!
జూన్ 12, 2026

Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు
జూన్ 10, 2026

Climate Innovation Summit 2026 | రేపే ‘క్లైమేట్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026’.. ప్రసంగించనున్న సంతోష్ కుమార్
మే 27, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



