Car Modification | కారును అక్రమంగా మోడిఫై చేశాడు.. కొన్న ఖరీదు కన్నా ఫైన్లనే అధికంగా చెల్లించాడు..
Car Modification | చాలా మంది యువత తమ ద్విచక్ర వాహనాలకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా మోడిఫై చేయబడిన ఎగ్జాస్ట్‌లను బిగిస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే తరచూ ఇలాంటి వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తుంటారు. అలాంటి వాహనాలను సీజ్ చేసి వాటి సైలెన్సర్లను తీసి రోడ్డు రోలర్‌తో తొక్కిస్తుంటారు.
Viral news | Published On Jan 17, 2026, 8.55 am IST
Car Modification | చాలా మంది యువత తమ ద్విచక్ర వాహనాలకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా మోడిఫై చేయబడిన ఎగ్జాస్ట్‌లను బిగిస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే తరచూ ఇలాంటి వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తుంటారు. అలాంటి వాహనాలను సీజ్ చేసి వాటి సైలెన్సర్లను తీసి రోడ్డు రోలర్‌తో తొక్కిస్తుంటారు. ఇలాంటి సంఘటనలను మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే సరిగ్గా ఇదే కోవలో ఓ యువకుడు తన కారును మోడిఫై చేశాడు. ఆ కారుతో రహదారులపై అందరికీ ఇబ్బంది కలిగించేలా తిరిగాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అతని కారుపై భారీ ఎత్తున జరిమానా విధించారు. ఈ క్రమంలో అతను ఆ కారును కొన్న ఖరీదు కన్నా జరిమానాలనే అధికంగా చెల్లించాల్సి వచ్చింది.
కేరళలోనూ కన్నూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు 2002 మోడల్ హోండా సిటీ కారును రూ.70వేల చవక ధరకు కొనుగోలు చేశాడు. అయితే ఆ కారు బాగానే ఉన్నా అతను అంతటితో ఆగలేదు. దాన్ని అనేక రకాలుగా మోడిఫై చేయించాడు. చూస్తేను కళ్లకు ఫ్లాష్ అయ్యే విధంగా మెరుపు లాంటి కలర్‌ను కార్‌కు కోట్ వేయించాడు. అలాగే ఎగ్జాస్ట్ కూడా మార్చాడు. కారుపై అర్థం పర్థం లేని రెచ్చగొట్టే గ్రాఫిటి డిజైన్లను కూడా వేయించాడు. అనంతరం ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకునేందుకు బెంగళూరుకు వచ్చాడు. అయితే అక్కడ ప్రశాంతంగా ఉండకుండా రహదారులపై కారును వేగంగా నడిపిస్తూ హల్ చల్ చేశాడు. ఆ కారు సైలెన్సర్ శబ్దం స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఈ విషయాన్ని స్థానిక ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తెచ్చారు. అతనిపై సోషల్ మీడియా వేదికగా పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు.
అయితే ఆ ఫిర్యాదుతోపాటు ఆ యువకుడు పాల్పడుతున్న న్యూసెన్స్‌ను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ అయిన వీడియోల్లో గమనించారు. దీంతో వెంటనే వారు ఆ కార్‌ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఆ కారును బెంగళూరులోని భారతీయ సిటీలో గుర్తించారు. వెంటనే ఆ కార్‌ను సీజ్ చేయడంతోపాటు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను అక్రమంగా కారునే అనేక రకాలుగా మోడిఫై చేశాడు కనుక అతనికి జరిమానా విధించడం ఆర్టీవో పరిధిలోకి వస్తుందని చెప్పి అతన్ని ఆర్‌టీవో ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో అతనికి అధికారులు ఏకంగా రూ.1.10 లక్షల జరిమానా విధించారు. ఆ జరిమానా చెల్లిస్తేనే కారును ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అతను ఆ జరిమానా మొత్తాన్ని చెల్లించి కారును వెనక్కి తీసుకున్నాడు. అయితే అధికారులు అతనికి వార్నింగ్ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఆ మోడిఫికేషన్‌లను తీసేయాలని, లేదంటే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేశారు. మరి అతను దాన్ని పాటిస్తాడా, లేదా.. అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అతను కారును కొన్న ధర కన్నా అధిక మొత్తంలో ఫైన్‌నే చెల్లించాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

Hyderabad City Police | చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నకిలీ నంబర్ ప్లేట్.. క్రిమినల్ కేసు నమోదు
మే 20, 2026

Kerala | 10 గంటలకు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. 20 మంది మంత్రులు కూడా..
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



