త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఆఫీసుకి 40 నిమిషాలు ముందుగా వచ్చిందని జాబ్‌లో నుంచి తీసేసిన బాస్

షిఫ్ట్ టైమింగ్ కంటే ముందే ఆఫీస్‌కి రావడం అంటే కంపెనీ రూల్స్‌ను బ్రేక్ చేయడమేనని, కంపెనీ రూల్స్ బ్రేక్ చేస్తే ఉద్యోగం ఊడుతుందని, అందుకే తనను ఉద్యోగంలో నుంచి తీసేసినట్టు బాస్ చెప్పడంతో షాక్ అయిన ఆ యువతి అక్కడి సోషల్ కోర్టులో పిటిషన్ వేసింది.

J

Viral news | Published On Dec 10, 2025, 8.47 pm IST

ఆఫీసుకి 40 నిమిషాలు ముందుగా వచ్చిందని జాబ్‌లో నుంచి తీసేసిన బాస్
Advertisement

చాలామంది ఆఫీసులకు లేట్‌గా వస్తుంటారు కానీ ముందుగా ఎవ్వరూ రారు. ఒకవేళ ముందుగా వచ్చినా కంపెనీకి వచ్చిన నష్టమేమీ ఉండదు. లేట్‌గా వస్తేనే వర్క్ ఆగిపోతుంది. ట్రాఫిక్ జామ్, ఇతరత్రా కారణాల వల్ల కొందరు లేట్‌గా వస్తారు. ఓ యువతి మాత్రం ఆఫీసుకి ముందుగా వచ్చిందని తన జాబ్ పీకేశాడు బాస్. చదవడానికి వింతగా ఉన్నా ఈ ఘటన స్పెయిన్ దేశంలో జరిగింది.

22 ఏళ్ల యువతి ఓ కంపెనీలో లాజిస్టిక్స్ వర్కర్‌గా పనిచేస్తోంది. అయితే.. తన షిఫ్ట్ టైమింగ్స్ కంటే 40 నిమిషాల ముందే ఆ యువతి ఆఫీసుకు పలు మార్లు రావడం బాస్ గమనించాడు.

గత కొన్నేళ్లుగా అదే కంపెనీలో పని చేస్తున్న ఆ యువతి 2023 నుంచి చాలాసార్లు ఆఫీసు టైమింగ్స్ కంటే ముందే ఆఫీసుకు చేరుకునేది. అలా 19 సార్లు ఆఫీసుకు ముందుగానే చేరుకోవడంతో విసిగిపోయిన బాస్.. ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేశాడు.

కంపెనీ రూల్స్ బ్రేక్ చేసినందుకే

షిఫ్ట్ టైమింగ్ కంటే ముందే ఆఫీస్‌కి రావడం అంటే కంపెనీ రూల్స్‌ను బ్రేక్ చేయడమేనని, కంపెనీ రూల్స్ బ్రేక్ చేస్తే ఉద్యోగం ఊడుతుందని, అందుకే తనను ఉద్యోగంలో నుంచి తీసేసినట్టు బాస్ చెప్పడంతో షాక్ అయిన ఆ యువతి అక్కడి సోషల్ కోర్టులో పిటిషన్ వేసింది.

తను వర్క్ పర్‌ఫెక్ట్‌గా చేస్తున్నా, తనను ఉద్యోగంలో నుంచి తీసేయడం అన్‌ఫెయిర్ అని చెప్పి తను కోర్టు మెట్లు ఎక్కింది.

దీంతో కంపెనీ వారు కూడా తన వర్క్ చిట్టా మొత్తాన్ని కోర్టు ముందుంచారు. తను ఎర్లీగా ఆఫీసుకు రావడమే కాదు, ఒక్కోసారి ఆఫీసుకు రాకున్నా కంపెనీ యాప్ ద్వారా ముందుగానే లాగిన్ అయిందని, అలాగే కంపెనీ పర్మిషన్ లేకుండా కంపెనీ కార్ల బ్యాటరీలు అమ్మేందుకు ప్రయత్నించిందని ఇవి స్పెయిన్ వర్కర్స్ రూల్స్ లో ఆర్టికల్ 54 ను తుంగలో తొక్కినట్టే అని కోర్టుకు తెలిపారు. దీంతో సోషల్ కోర్టు ఆ యువతి కేసును కొట్టేసింది. దీంతో ఆ యువతి సుప్రీం కోర్టు మెట్లెక్కేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement