త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalu Putik | పనికిరాని చెత్తతో ఫ్యాషన్ దుస్తులు.. మనోడి క్రియేటివిటీకి ఇన్‌స్టా భారీ ఆఫర్.. అయినా పట్టించుకోని ఇన్‌ఫ్లూయెన్సర్

ప్రపంచవ్యాప్తంగా పుటిక్‌కు భారీ ఫాలోయింగ్ లభిస్తున్నా, గుర్తింపు వస్తున్నా, ఇప్పటికీ అదే చెత్తాచెదారంతో సరికొత్త ఫ్యాషన్ డిజైన్లను రూపొందిస్తూ వీడియోలు చేస్తున్నాడు పుటిక్.

J

Viral news | Published On May 3, 2026, 5.53 pm IST

Kalu Putik | పనికిరాని చెత్తతో ఫ్యాషన్ దుస్తులు.. మనోడి క్రియేటివిటీకి ఇన్‌స్టా భారీ ఆఫర్.. అయినా పట్టించుకోని ఇన్‌ఫ్లూయెన్సర్
Advertisement

Kalu Putik | అతడి పేరు కలు పుటిక్. ఊరు ఇథియోపియా. సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా మనోడి వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కలు పుటిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అందులోనూ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పెద్ద బ్రాండ్ల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా, వాటిని పట్టించుకోకుండా తనదైన శైలిలో వీడియోలు చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు పుటిక్. పాత ప్లాస్టిక్ సీసాలు, పాత టైర్లు, పాత వైర్లు, దేనికీ పనికిరాని చెత్తతో అద్భుతమైన ఫ్యాషన్ దుస్తులను తయారు చేసి వాటిని ధరించి వీడియో చేస్తాడు. ఇదే మనోడి స్టైల్. మనోడి టాలెంట్‌కి ఫిదా కాని వాళ్లు లేరు అంటే అతిశయోక్తి కాదు.

నెల రోజుల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్లు

మనోడి క్రియేటివిటీకి నెల రోజుల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. పుటిక్ ఏ వీడియో చూసినా.. ఒక్క మాట కూడా మాట్లాడడు. కేవలం తన అద్భుతమైన క్రియేటివిటీతో పనికి రాని వస్తువులతో తయారు చేసిన డ్రెస్సులను వేసుకొని సైలెంట్‌గా ర్యాంప్ వాక్ చేస్తాడు.

మనోడు హైలెట్ అయింది అక్కడే

పుటిక్ దేనికీ పనికిరాని చెత్త నుంచి అందమైన డ్రెస్సులను తయారు చేయడం అనేది టర్నింగ్ పాయింట్. దాన్ని సస్టేనబుల్ ఫ్యాషన్ అంటారు. అది జనాలు మెచ్చడంతో పుతిక్ హైలెట్ అయ్యాడు. మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అదే సస్టేనబుల్ ఫ్యాషన్‌కు ఐకాన్‌గా మారాడు.

viral ethipian fashion creator kalu putik gains huge following

ఇన్‌స్టాగ్రామ్ ఆఫర్ తిరస్కరణ

పుటిక్ టాలెంట్ మెచ్చిన ఇన్‌స్టాగ్రామ్ టీమ్ అతడి వీడియోలను ఇన్‌స్టా అఫిషియల్ అకౌంట్‌లో ఫీచర్ చేయాలని భావించి అతడు చేసిన ఓ వీడియోలో టీమ్ కామెంట్ చేసింది. డైరెక్ట్ మెసేజ్ కూడా పంపించింది. కానీ.. కలు పుటిక్ ఆ మెసేజ్‌కి స్పందించలేదు. ఇన్‌స్టా మాత్రమే కాదు.. గుస్సి, నైక్, జారా లాంటి ప్రముఖ బ్రాండ్స్ కూడా అతడితో కలిసి పని చేయడానికి అతడిని కాంటాక్ట్ చేసినా రెస్పాండ్ కాలేదు.

సెలబ్రిటీల ప్రశంసలు

మనోడి టాలెంట్‌కి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ప్రముఖ హాలీవుడ్ సింగర్ సిజా, మైఖేల్ జోర్డాన్ లాంటి వాళ్లు పుటిక్ క్రియేటివిటీని చూసి నోరెళ్లబెట్టారు.

ప్రపంచవ్యాప్తంగా పుటిక్‌కు భారీ ఫాలోయింగ్ లభిస్తున్నా, గుర్తింపు వస్తున్నా, ఇప్పటికీ అదే చెత్తాచెదారంతో సరికొత్త ఫ్యాషన్ డిజైన్లను రూపొందిస్తూ వీడియోలు చేస్తున్నాడు పుటిక్.

Advertisement
Advertisement