త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | నాగార్జున‌, రాజ‌శేఖ‌ర్ హీరోలుగా మ‌ల్టీస్టార‌ర్ మూవీ – గ్రాండ్‌గా లాంఛ్ కానీ….

నాగార్జున, రాజ‌శేఖ‌ర్ హీరోలుగా ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రావాల్సింది. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా మొద‌లైంది. ఓపెనింగ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈ సినిమా ఆగిపోయింది.

N

Entertainment | Published On Jun 1, 2026, 7.03 pm IST

Tollywood | నాగార్జున‌, రాజ‌శేఖ‌ర్ హీరోలుగా మ‌ల్టీస్టార‌ర్ మూవీ – గ్రాండ్‌గా లాంఛ్ కానీ….
Advertisement

Tollywood | టాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్కినేని హీరో నాగార్జున ఎక్కువ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశారు. వార‌సుడు, సీతారామ‌రాజు, నిన్నే ప్రేమిస్తా, మ‌నం, ఊపిరితో పాటు నాగార్జున హీరోగా న‌టించిన ప‌లు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు బిగ్గ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి.

రేర్ మ‌ల్టీస్టార‌ర్‌...

నాగార్జున కెరీర్‌లో ఓ రేర్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ మాత్రం గ్రాండ్‌గా ఓపెనింగ్ ఈవెంట్ జ‌రిగిన త‌ర్వాత ఆగిపోయింది. నాగార్జున‌, రాజ‌శేఖ‌ర్ హీరోలుగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేయాల‌ని నిర్మాత అక్కినేని వెంక‌ట్ అనుకున్నారు. ఇద్ద‌రు హీరోల ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా డైరెక్ట‌ర్ ఈవీవీ ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. హ‌లో బ్ర‌ద‌ర్‌, వార‌సుడు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత నాగార్జున‌, ఈవీవీ కాంబోపై టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రోవైపు ఈవీవీ డైరెక్ష‌న్‌లో రాజ‌శేఖ‌ర్ ఫ‌స్ట్ టైమ్ చేస్తుండ‌టం, అందులోనూ మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూశారు.

తెలుగు ఆడియెన్స్ మిస్‌...

ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. నాగార్జున‌, రాజ‌శేఖ‌ర్‌ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి హీరో కృష్ణ క్లాప్ కొట్టారు. మ‌రో స్టార్ వెంక‌టేష్ కెమెరా స్విఛాన్ చేశారు. ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ ఓపెనింగ్ ఈవెంట్‌కు అటెండ్ అయ్యారు.
కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ప్రారంభోత్స‌వ వేడుక‌తోనే ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆగిపోయింది. సినిమా సెట్స్‌పైకి రాలేదు. అలా రాజ‌శేఖ‌ర్‌, నాగార్జుల‌న కాంబోను చూసే అవ‌కాశాన్ని తెలుగు ఆడియెన్స్ మిస్స‌య్యారు. ఇదే కాకుండా చిరంజీవి, వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌ని ఈవీవీ ప్ర‌య‌త్నించారు. రామానాయుడు ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. క‌థ ఓకే కాక‌పోవ‌డంతో ఆ సినిమా కూడా ఆగిపోయింది.

 

Advertisement
Advertisement