త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC Meeting | టెస్టులు, టీ20ల్లో కీల‌క మార్పులు.. ఐసీసీ బోర్డు మీటింగ్ గ్రీన్ సిగ్న‌ల్‌..

ICC Meeting | అహ్మదాబాద్‌లో సోమవారం జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు సమావేశంలో క్రికెట్ మూడు ఫార్మాట్లకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ అధికారులపై ఉన్న నిబంధనల్లో మార్పులతో పాటు, టెస్టు క్రికెట్‌లో పింక్ బాల్‌ను ప్రయోగాత్మకంగా వినియోగించేందుకు కూడా ఆమోదం లభించింది.

P

Sports | Published On Jun 1, 2026, 6.56 pm IST

ICC Meeting | టెస్టులు, టీ20ల్లో కీల‌క మార్పులు.. ఐసీసీ బోర్డు మీటింగ్ గ్రీన్ సిగ్న‌ల్‌..
Advertisement

ICC Meeting | అహ్మదాబాద్‌లో సోమవారం జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు సమావేశంలో క్రికెట్ మూడు ఫార్మాట్లకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ అధికారులపై ఉన్న నిబంధనల్లో మార్పులతో పాటు, టెస్టు క్రికెట్‌లో పింక్ బాల్‌ను ప్రయోగాత్మకంగా వినియోగించేందుకు కూడా ఆమోదం లభించింది. ఇప్పటివరకు మ్యాచ్‌ల సమయంలో కోచింగ్ కమ్యూనికేషన్‌పై కఠిన పరిమితులు ఉండేవి. తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై హెడ్ కోచ్, ఆయన నియమించిన ప్రతినిధి డ్రింక్స్ విరామ సమయంలో ఆటగాళ్లతో నేరుగా సంప్ర‌దింపులు జ‌రిపేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. ఆ సమయంలో వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు అవకాశం కల్పించడం వల్ల, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చని ఐసీసీ భావిస్తోంది.

టీ20ల్లో కొత్తగా 15 నిమిషాల విరామం

టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో రెండు ఇన్నింగ్స్‌ల మధ్య తప్పనిసరిగా 15 నిమిషాల విరామాన్ని సైతం బోర్డు ఆమోదించింది. మ్యాచ్ నిర్వహణను మరింత సజావుగా చేయడం, ఆటగాళ్లకు తగినంత సిద్ధత సమయం ఇవ్వడం, అలాగే ప్రసార అవసరాలను మెరుగ్గా స‌మ‌న్వ‌యం చేయ‌డం ఈ నిర్ణ‌యం వెనుక ఉన్న ప్ర‌ధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌పై విచార‌ణ‌లో ఇకపై మ్యాచ్ అధికారులకు హెవక్-ఐ టెక్నాలజీ డేటాను వినియోగించే అవకాశం లభించనుంది. బౌలర్ యాక్షన్‌పై అనుమానం వచ్చిన సందర్భంలో, ఈ సాంకేతిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రిపోర్టులు సిద్ధం చేయడం, విచారణ కొన‌సాగించేందుకు అవ‌కాశం ఉంటుంది. దాంతో ఈ ప్రక్రియ మరింత శాస్త్రీయంగా, ఖచ్చితంగా మారుతుందని ఐసీసీ భావిస్తోంది.

టెస్టు క్రికెట్‌లో పింక్ బాల్ ప్రయోగం

మరో కీలక నిర్ణయంగా టెస్టు క్రికెట్‌లో పింక్ బాల్ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెలుతురు సమస్యల కారణంగా ఆట నిలిచిపోతున్న సందర్భాల్లో ఈ ప్రయోగం చేపట్టనున్నారు. అయితే, పింక్ బాల్ వినియోగానికి రెండు జట్ల అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. ఈ నిర్ణ‌యంతో డే లైట్ సమస్యల వల్ల నిలిచిపోయే ఆటను తగ్గించి మరిన్ని ఓవర్లు ఆడించే అవకాశం ఉంటుందని ఐసీసీ అంచ‌నా వేస్తున్న‌ది. ఈ నిర్ణయాలు క్రికెట్‌ను మరింత ఆధునికంగా, సాంకేతిక ఆధారితంగా, జ‌న‌రంజ‌కంగా మార్చే దిశ‌గా ఐసీసీ తీసుకున్న నిర్ణ‌యాలు కీల‌మ‌ని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement