పేద యువకులకు భారీ జాక్పాట్.. తవ్వకాల్లో 50 లక్షల విలువైన వజ్రం లభ్యం | త్రినేత్ర News
పేద యువకులకు భారీ జాక్పాట్.. తవ్వకాల్లో 50 లక్షల విలువైన వజ్రం లభ్యం
పన్నా జిల్లాలోని రాణిగంజ్ ప్రాంతానికి చెందిన సతీశ్ ఖటిక్, సాజిద్ మహ్మద్ ఇద్దరూ స్నేహితులు. ఇద్దరికీ పూట గడవడం కూడా కష్టమే. వీళ్లకు ఇంట్లో పెళ్లిళ్లు చేయాల్సిన చెల్లెళ్లు కూడా ఉన్నారు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఇద్దరూ నిర్ణయించుకొని కళ్యాణ్పూర్ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న గనిని 20 రోజుల కోసం లీజుకు తీసుకున్నారు.