Seethakka | ఆ సీతక్కేనా! 2004 జాతరలో అనామకురాలు.. ఇప్పుడేమో అమాత్యురాలు
Seethakka | అజ్ఞాత నక్సలైట్ జీవితానికి స్వస్థిపలికి రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచే ఆమె తన లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేషించుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకోవడమంటే చిన్న విషయం కాదు. కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాట సీతక్కకు అచ్చంగా అతికినట్టుగా ఉంటుంది.
Viral news | Published On Jan 18, 2026, 10.57 am IST
అది డిసెంబర్ 2003 చివరి వారం. తేది గుర్తుకు లేదు. హైదరాబాద్ వెళ్లేందుకు మధ్యాహ్నం హన్మకొండలో బస్సు ఎక్కాను. దారివెంటా బస్టాప్‌ల వద్ద ఆగుతూ, ప్రయాణికులకు ఎక్కించుకుంటూ పోతోంది. మరో బస్టాప్‌లో ముగ్గురు పిల్లలతో ఒక మహిళ బస్సు ఎక్కింది. మహిళలకు కేటాయించిన ముందు సీట్లో పిల్లలను కూర్చోబెట్టి, తను లగేజిని పైన క్యాబిన్‌లో సర్దుతూ వెనుక సీట్లో కూర్చున్న నన్ను గమనించి పలకరించింది. ఆ తర్వాత ఆమె కూర్చున్న సీటు వద్దకెళ్లి పలకరించాను. సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలను హాస్టల్‌లో వదిలిపెట్టడానికి వెళ్తున్నట్టు చెప్పింది. తన పిల్లాడితోపాటు మిగతా ఇద్దరూ తన అన్న పిల్లలని చెప్పింది. బస్సు హైదరాబాద్ చేరుకోగానే ఉప్పల్‌లో బస్సు దిగి వెళ్తూ, విండో సైడ్ కూర్చున్న నా వైపు చూస్తూ, ‘వెళ్లోస్త అన్నా’ అని చెప్పింది.. ఆమె ఎవరో కాదు ప్రస్తుత మంత్రి సీతక్క.
అంతకుముందు కొన్ని వారాల ముందే ఆమె టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో సీతక్క పరిచయం. ఆ తర్వాత వరంగల్ టీడీపీ ఆఫీసులో జరిగే ప్రెస్‌మీట్‌లలో తరుచూ కనిపించి పలకరిస్తుండటంతో స్వల్ప కాలంలోనే సుపరిచితం అయింది. పైగా సీతక్క పూర్వాశ్రమం నక్సలైట్ కావడంతో మీడియా కూడా ఆమెకు ప్రాధాన్యత ఇచ్చేది. ఆ తర్వాత ఏమి జరిగిందంటే...
సరిగ్గా 22 ఏండ్ల క్రితం 2004లో మేడారం జాతర ఫిబ్రవరిలో జరిగింది. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారు. మూడు, నాలుగు రోజుల ముందు సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు నర్సంపేట టీడీపీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు సాన మారుతి (కరీంనగర్), వేం నరేందర్‌రెడ్డి (మహబూబాబాద్), సీతక్క(ములుగు) మేడారం వచ్చారు. వారిలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి తప్ప మిగతా వారు అప్పుడు ఎమ్మెల్యేలు కాదు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పరిశీలనకు మేడారం వెళ్లిన టీడీపీ బృందం తమ వెంట వరంగల్ నుంచి మీడియాను తీసుకెళ్లింది. వారిలో నేనూ(ఆంధ్రభూమి) ఉన్నాను. ఆ సందర్భంగా తీసిన ఫోటోలో అప్పుడు పార్టీ నాయకుల వెనుక అమాయకంగా నిలబడి ఉన్నది ఇప్పుడు మంత్రిగా ఉన్న సీతక్కనే. అదే సీతక్క 20 ఏండ్ల తర్వాత 2004లో, అలాగే ప్రస్తుత మేడారం జాతర ఏర్పట్లను మంత్రిహోదాలో పర్యవేక్షిస్తున్నారు. అప్పుడు తమ వెనక నిలబడిన ఆమెనే భవిష్యత్‌లో మంత్రి అయి మేడారం జాతర ఏర్పట్లను తనే పర్యవేక్షిస్తుందని ఎవరైనా ఉహించారా? బహూశా సీతక్క కూడా ఉహించి ఉండరెమో. (అందుకు నేను సాక్ష్యం. అదే ఫోటోలో రెడ్ కలర్ షర్ట్, టోపీతో కనిపించేది నేను).
తానీ స్థాయికి ఎదగడానికి సీతక్క పడిన కష్టాలు, కన్నీళ్లు ఆమెను ముందు నుంచి చూసిన వారికి మాత్రమే తెలుసు? అజ్ఞాత నక్సలైట్ జీవితానికి స్వస్థిపలికి రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచే ఆమె తన లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేషించుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకోవడమంటే చిన్న విషయం కాదు. కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాట సీతక్కకు అచ్చంగా అతికినట్టుగా ఉంటుంది. ఈ కథనంలో నేను జతపరిచిన ఫోటో చూడండి... ఆ విషయం మీకే అర్థం అవుతుంది.

ఇది ఇలా ఉండగా, 2004 జాతర తర్వాత అదే నెల చివరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడి ఏప్రిల్ ఎన్నికలు జరిగాయి. ములుగు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీతక్క ఓడి పోయినప్పటికీ 2009లో తిరిగి అక్కడి నుంచే పోటీ చేసి మంత్రి పొదేం వీరయ్యపై విజయం సాధించారు. 2014లో మినహా 2018, 2023 వరుసగా గెలుపొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారి మంత్రిపదవి చేపట్టారు.
ఏప్రిల్ 2004లో జరిగిన ఎన్నికల్లో సీతక్కకు టిడిపి టికెట్ వచ్చిన సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో ‘బ్యాలెట్ బరిలో.. బుల్లెటు సీతక్క’ శీర్షికతో అంతకు ముందు నేను రాసిన కథనం దోహదం చేసిందని కూడా అందులో గుర్తు చేసారు.
తాను అనుభవించిన కడు పేదరికం, పదేండ్ల పాటు నక్సలైట్‌గా అజ్ఞాతవాసం, తన సోదరుడు సాంబయ్య నక్సల్స్‌లో చేరిన నెలతీరకుండా ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం, తన కుటుంబం అనాథ కాకూడదని జనజీవన స్రవంతిలో కలవడం, ఆపేసిన చదువును తిరిగి కొనసాగిస్తూ మరో వైపు హైదరాబాద్‌లో ఒక ఎన్జీవోలో 15 వందల జీతానికి పని చేయడం, తన పిల్లాడిని, అన్న పిల్లలను హాస్టల్‌లో చదివించడం వంటి పలు ఆసక్తికర వ్యక్తిగత విషయాలు నాతో పంచుకుంది. ఆ విషయాలను 2004, ఏప్రిల్ 6వ తేదీన సీతక్క డైరీలో ఓ రోజు శీర్షికతో ఆంధ్రభూమిలో ప్రచురితం.
వెల్జాల చంద్రశేఖర్
9849998093
వెల్జాల ఫేస్ బుక్ వాల్ నుంచి
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



