త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | మౌని అమావాస్య‌.. దైవ‌ ద‌ర్శ‌నానికి వెళ్లివ‌స్తుండ‌గా రోడ్డుప్ర‌మాదం.. భార్య మృతి, భర్తకు గాయాలు

Road Accident | దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్లివ‌స్తుండ‌గా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో (Road Accident) భార్య మృతిచెంద‌గా, భ‌ర్త‌, కుమారుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

G

Telangana | Published On Jan 18, 2026, 12.25 pm IST

Road Accident | మౌని అమావాస్య‌.. దైవ‌ ద‌ర్శ‌నానికి వెళ్లివ‌స్తుండ‌గా రోడ్డుప్ర‌మాదం.. భార్య మృతి, భర్తకు గాయాలు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్లివ‌స్తుండ‌గా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో (Road Accident) భార్య మృతిచెంద‌గా, భ‌ర్త‌, కుమారుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లాలోని మాల్కాపురం వ‌ద్ద చోటుచేసుకున్న‌ది.

మౌని అమావాస్య కావ‌డంతో హైదరాబాద్‌లోని గుర్రంగూడకు చెందిన దంపతులు పీ.దుర్గ (25), ఆమె భర్త, కుమారుడు స్కూటీపై చెరువుగట్టులోని (Cheruvugattu) శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. ఆదివారం ఉదయం ముగ్గురు త‌మ స్కూటీపై తిరిగి హైద‌రాబాద్‌ వస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌ల్కాపురం వ‌ద్ద జాతీయ‌ర‌హ‌దారిపై గుర్తుతెలియని వాహనం వారి స్కూటీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ దుర్గ అక్కడికక్కడే మృతిచెందారు. భ‌ర్త, కుమారుల‌కు గాయాల‌వ‌డంతో పోలీసులు వారిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement