Revanth Reddy | రేవంత్‌లో బాబును చూసుకుంటున్న టీడీపీ మీడియా..!
Revanth Reddy | తెలుగు మీడియాలో బాబుకు దక్కిన ఈ గౌరవం మరెవరికీ దక్కదు అనుకునే వాడిని.. ఈ రోజు ఆర్‌కే పలుకులు చదివాక రేవంత్‌లో బాబును చూసుకుంటున్న తీరు ముచ్చటేసింది.. మంత్రి - ఐఏఎస్ వివాదం సిట్ ఏర్పాటులో పవిత్ర సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అని ఆర్‌కే సర్టిఫికెట్ ఇచ్చేశారు.. సిట్ ఏర్పాటు చేశారా? నిజమా నాకు తేలియదే అని రేవంత్ ఆశ్చర్య పోయినట్టు రాస్తే బాగుండేది.
Viral news | Published On Jan 18, 2026, 10.39 am IST
ఈ రోజు ఆర్‌కే ముచ్చట్లు చదివాక చాలా సంతోషం వేసింది.. పాత రోజులు గుర్తుకు వచ్చాయి . 95లో హైదరాబాద్‌కు వచ్చాక టీడీపీ బీట్ రిపోర్టర్‌ను బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ చూస్తున్న నన్ను చూసి హిమాయత్‌నగర్‌లోని టీడీపీ ఆఫీస్ సెక్రెటరీ మూర్తి తానే పలకరించి కొత్తనా అని అడిగాడు. అప్పటి నుంచి మంచి పరిచయం. టీడీపీ పుట్టుక నుంచి అప్పటి వరకు జరిగిన ఎన్నో విషయాలు చెప్పేవాడు.. కొన్ని రోజుల తరువాత నా దూకుడు చూసి ఓ మాట చెప్పాడు.. నీకు వార్తలే చాలు అనుకుంటే ఒకే.. కానీ ఎదగాలి అనుకుంటే చిన్న మార్పు అవసరం. నువ్వు రాయాలి అనుకున్నది రాయి వద్దు అనడం లేదు.. కానీ అలా రాయవద్దు.. తప్పు పార్టీ నాయకులు, మంత్రులు, అధికారులు ఎవరి మీదైనా రాయి.. బాబుకు సంబంధం లేదు తప్పంతా మిగిలిన వారిదే అని రాయాలి అలా రాస్తే ఎదుగుతావు నీ ఇష్టం అని సలహా ఇచ్చాడు..
పొలిట్ బ్యూరో, క్యాబినెట్ అంతా డమ్మీ.. చివరకు పార్టీ ఆఫీస్‌లో ఏ కులం నాయకులను తిట్టేందుకు ఏ కులం నాయకుడు వెళ్ళాలి అనేది కూడా బాబే నిర్ణయిస్తాడు. పాపం డమ్మీల మీద ఏం రాస్తాం.. అని మూల విరాట్టు మీదే రాసే వాడిని.. అప్పుడే కాదు ఇప్పటికీ టీడీపీ మీడియా ఇదే పాలసీ పాటిస్తుంది. బాబుకు మట్టి అంటకుండా రాస్తారు..
అయితే ?
తెలుగు మీడియాలో బాబుకు దక్కిన ఈ గౌరవం మరెవరికీ దక్కదు అనుకునే వాడిని.. ఈ రోజు ఆర్‌కే పలుకులు చదివాక రేవంత్‌లో బాబును చూసుకుంటున్న తీరు ముచ్చటేసింది.. మంత్రి - ఐఏఎస్ వివాదం సిట్ ఏర్పాటులో పవిత్ర సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అని ఆర్‌కే సర్టిఫికెట్ ఇచ్చేశారు.. సిట్ ఏర్పాటు చేశారా? నిజమా నాకు తేలియదే అని రేవంత్ ఆశ్చర్య పోయినట్టు రాస్తే బాగుండేది.
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం గుర్తుంది కదా? ప్రభుత్వాన్ని ఇంటికి పంపిన ఉద్యమం ఇది.. విజయవాడలో మహానాడు జరుగుతున్నప్పుడు విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం వచ్చింది. బాబు బోలెడు ఆశ్చర్య పోయి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో విద్యుత్ అధికారులను విజయవాడకు పిలిపించి మందలించారు.. మీడియా అంతా పాపం బాబు గారికి తెలియకుండానే చార్జీలు పెంచారు అని బోలెడు సానుభూతి తెలిపారు.. వార్తలు రాశారు. డ్రామా బాగా పండింది అనుకున్నారు. కానీ అది పండలేదు అని ఎన్నికల్లో తేలింది.. ఇప్పుడు సరిగ్గా అలానే రాశారు. సీఎంకు తెలియకుండానే sit ఏర్పాటు జరిగిందట.. భూములు అమ్ముకోవడం, కాంట్రాక్ట్‌లు, బెదిరింపులు కాంగ్రెస్‌లో సర్వ సాధారణం. అందరిదీ అదే వ్యాపారం అనుమానం లేదు. అయితే బొగ్గు కాంట్రాక్ట్ దందాలకు కోమటిరెడ్డి ఐఏఎస్ వ్యవహారం వార్తకు సంబంధం ఏమిటీ ?
ఇదేమన్నాపెళ్లి సంబంధమా ? నీ క్యారెక్టర్ బాగా లేదని టీవీలో వచ్చింది కాబట్టి పిల్లను ఇవ్వం అని చెప్పడానికి.. కేసులు లేకపోతే రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఎన్ని పెద్ద కేసులు ఉంటే అంత గొప్ప గుర్తింపు. ఓటుకు నోటు కేసుతోనే కదా రేవంత్ రెడ్డి జైలు నుంచి సీఎం పదవికి ఎదిగింది.. ఆర్‌కే లింక్ కుదరడం లేదు.. ఇలాంటి వార్తలు వస్తే కాంట్రాక్ట్ రావడానికి అడ్డంకి ఎలా అవుతుంది..
మరో మాట.. ఆ ఐఏఎస్ అధికారి ఆత్మహత్య ప్రయత్నం చేశారట ఆర్‌కే వార్త.. ఆత్మహత్య యత్నం నేరం.. మరి ఆమె మీద కేసు నమోదు చేశారా ? ఒక వేళ ఆత్మహత్యయత్నం వార్త తప్పు అయితే ఆర్‌కే ఇలా రాసినందుకు ఐఏఎస్ సంఘం వారికి సమ్మతమేనా ? ఎలాంటి అభ్యంతరం లేదా ? సీఎం కోసం సీఎం చెప్పి రాయించుకున్నట్టు ఉంది ఆర్‌కే వార్త.. రేవంత్ కోసం ఆర్‌కే మరింతగా కష్టపడాలి తప్పదు..
- సీనియర్ జర్నలిస్టు మురళి బుద్ధా ఫేస్ బుక్ వాల్ నుంచి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



