త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Techie Salary 40 LPA | రూ.40 లక్షల ప్యాకేజీ వస్తున్నా నేను పేదవాడినే.. కనీసం ఇల్లు కూడా కొనలేకపోతున్నా: టెక్కీ ఆవేదన

సంవత్సరానికి రూ.40 లక్షల ప్యాకేజీ వస్తున్నా తాను పేదవాడినేనని, కనీసం సొంతిళ్లు కూడా కొనలేకపోతున్నానని ఓ టెకీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

J

Viral news | Published On Jun 21, 2026, 1.00 am IST

Techie Salary 40 LPA | రూ.40 లక్షల ప్యాకేజీ వస్తున్నా నేను పేదవాడినే.. కనీసం ఇల్లు కూడా కొనలేకపోతున్నా: టెక్కీ ఆవేదన
Advertisement
  • రూ.40 లక్షల ప్యాకేజీ (LPA) తీసుకుంటున్న ఓ ఎన్ఐటీ (NIT) గ్రాడ్యుయేట్ టెకీ వాపోతున్న తీరు
  • తనకంటే టాలెంట్ తక్కువ ఉన్నవాళ్లు ఐటీ సెక్టార్‌లో ఏకంగా రూ.70 లక్షలు తీసుకుంటున్నారని ఫీలింగ్
  • ఇంత జీతం వస్తున్నా తాను సొంతిళ్లు కొనలేకపోతున్నానని, పేదవాడిగానే మిగిలిపోయానని స్నేహితుడితో చాట్
  • ఎక్స్‌ (X) లో వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై.. రియల్ ఎస్టేట్ ధరలు, పెరిగిన ఖర్చులపై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ

Techie Salary 40 LPA | త్రినేత్ర.న్యూస్ : ఐటీ సెక్టార్‌లో (IT Sector) ఉద్యోగం అంటేనే లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయి. కానీ, రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులతో ఆ భారీ జీతం కూడా సరిపోవడం లేదని చాలామంది టెకీలు ఫీల్ అవుతుంటారు. తాజాగా ఓ ఎన్ఐటీ (NIT) గ్రాడ్యుయేట్ అయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. సంవత్సరానికి రూ. 40 లక్షల ప్యాకేజీ (40 LPA) తీసుకుంటున్నా తాను పేదవాడినేనని, కనీసం ఒక సొంతిళ్లు కూడా కొనలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఫ్రెండ్‌తో అతడు చేసిన చాట్ తాలూకు స్క్రీన్‌షాట్ ఇప్పుడు ఎక్స్ (X) వేదికగా వైరల్ అవుతోంది.

టాలెంట్ లేని వాళ్లకేమో రూ.70 లక్షలు..

ఈ వైరల్ పోస్ట్ ప్రకారం.. ఆ టెకీ తనకు గత రెండేళ్లుగా ఎలాంటి ఇంక్రిమెంట్ (Increment) రాలేదని తన స్నేహితుడి దగ్గర వాపోయాడు. "రూ.40 లక్షల ప్యాకేజీ అనేది చాలా మంచి శాలరీ కదా" అని స్నేహితుడు అనగా, ఆ టెకీ దానికి తీవ్రంగా విభేదించాడు. "నా కంటే టాలెంట్ తక్కువ ఉన్నవాళ్లంతా 70 ఎల్‌పీఏ (70 LPA) ప్యాకేజీలతో కూర్చున్నారు" అని తన అసంతృప్తిని బయటపెట్టాడు.

సొంతిళ్లు కొనేంత సీన్ లేదు..

రూ.30 నుంచి 40 లక్షల జీతం అంటే అద్భుతమైన ప్యాకేజీ అని ఫ్రెండ్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా సదరు టెకీ శాంతించలేదు. "అయినా కూడా నాకు పేదరికం (Gareebi) ఫీలింగ్ వస్తోంది భయ్యా.. ఇన్ని లక్షలు సంపాదిస్తున్నా మేం కనీసం ఒక ఇల్లు (House) కూడా కొనుక్కోలేకపోతున్నాం" అని రిప్లై ఇచ్చాడు. ఈ సంభాషణను ఆ ఫ్రెండ్ స్క్రీన్‌షాట్ తీసి.. "ఇదిగో చూడండి.. 40 లక్షల ప్యాకేజీ వచ్చినా ఐటీ సెక్టార్ వాళ్లు ఎంతలా ఏడుస్తున్నారో" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

నిజమే అంటున్న నెటిజన్లు..

సాధారణంగా ఎడ్యుకేషన్, జర్నలిజం లాంటి ఇతర రంగాలతో పోలిస్తే టెక్ సెక్టార్‌లోనే భారీ ప్యాకేజీలు ఉంటాయి. అయినా సరే ఆ యువకుడు ఇల్లు కొనలేకపోతున్నానని చెప్పడం నెట్టింట పెద్ద చర్చకే దారితీసింది. ఆశ్చర్యకరంగా చాలామంది సదరు టెకీకి సపోర్ట్ చేస్తున్నారు.

"ఈ జనరేషన్‌లో హౌసింగ్ (Housing) అనేది చాలా పెద్ద ఇష్యూ. రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్ని లక్షల ప్యాకేజీ ఉన్నా సొంతిళ్లు కొనడం కష్టమే" అని ఒకరు కామెంట్ చేయగా.. "అది నిజమే.. ఇల్లు కొనలేరు కానీ, ఫ్లాట్ (Flat) అయితే కొనొచ్చు" అని మరొకరు రాసుకొచ్చారు. "ఇంత ప్యాకేజీలు వాళ్ళకు నిజంగా అర్హత ఉండి ఇస్తున్నారా లేక ప్రస్తుత మార్కెట్ హైప్ వల్ల వస్తున్నాయా?" అని ఇంకొక నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా, పెరుగుతున్న జీవన వ్యయం (Cost of living) పట్ల యువతలో ఉన్న ఆందోళనకు ఈ పోస్ట్ అద్దం పడుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement