Minister Ponnam Prabhakar | పదేళ్లు ఉద్యోగాల నియామక ప్రక్రియ నిలిచిపోయింది : మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar | గత 10 సంవత్సరాలుగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రకటించినట్టే ప్రకటించి మధ్యలోనే ఆగిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. శిల్పకళావేదికలో గ్రూప్-3 అభ్యర్థులకు నియామకపత్రాలు సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు.
Minister Ponnam Prabhakar | గత 10 సంవత్సరాలుగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రకటించినట్టే ప్రకటించి మధ్యలోనే ఆగిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. శిల్పకళావేదికలో గ్రూప్-3 అభ్యర్థులకు నియామకపత్రాలు సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎల్బి స్టేడియం నుంచి శిల్పకళ వేదిక నుంచి రవాణా శాఖ, పంచాయతీ రాజ్, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్ అనేక విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసి ముఖ్యమంత్రి గారే నియామకపత్రాలు అందజేశారన్నారు. తెలంగాణ నినాదమే నీళ్లు నిధులు నియామకాలు స్వాభిమానం కోసం జరిగిందని, గత పదేళ్లు సంవత్సరాలుగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రకటించినట్టే ప్రకటించి మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అలాంటి ఆటంకాలు తొలగించి నూతన నియామకాలు చేపట్టిందన్నారు.
ఆర్టీసీలో 2012లో నియామకాలు చేపడితే ఇప్పటి వరకు చేయలేదని, తాము వచ్చిన తర్వాత ఆర్టీసీలో 3030 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నామన్నారు. 4 కోట్ల మందిలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటే కాంపిటీషన్ ఏవిధంగా ఉంటుందో తెలుసునన్నారు. ఏ ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో స్వయంగా ముఖ్యమంత్రి తెప్పించుకొని జాబ్ క్యాలండర్ ద్వారా భర్తీ చేసే కార్యక్రమం చేపడుతున్నారని, తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో అనేక శాఖల్లో ఉంద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. భవిష్యత్ లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ పారదర్శక సేవలు అందించాలని, విద్యార్థి నాయకుడిగా ఉద్యోగాల భర్తీలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. విద్యకు, ఉపాధి అవకాశాలుకు పెంచడానికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



