లోడ్ అవుతోంది...


Viral Video | మన దేశంలో చాలామందికి సివిక్ సెన్స్ ఉండదు. అదే అతి పెద్ద సమస్య. ప్రభుత్వాలు దేశాన్ని క్లీన్గా ఉంచేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ముందు మనం మారాలి. కానీ.. మనం మాత్రం చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేస్తాం. అన్నింటినీ కలుషితం చేసేస్తాం. ఇండియాలో సివిక్ సెన్స్ అనేది పెద్ద జోక్ అని సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ వస్తుంటాయి. తాజాగా ఆ మీమ్ నిజమే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే.
ముంబైలోని గేట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న సముద్రం నీళ్లలో ఓ వ్యక్తి కవర్లో ఉన్న చెత్తను తీసుకొచ్చి పడేశాడు. అక్కడే ఉన్న ఓ ఫారెనర్ ఆ వ్యక్తి చెత్తను నీళ్లలో వేయడం చూసి ఏం చేస్తున్నావు అని అడిగాడు. అయినా కూడా వినకుండా చెత్తను నీళ్లలో వేసి అక్కడి నుంచి ఏం తెలియనట్లుగా వెళ్లిపోయాడు. దాన్ని వీడియో తీసిన ఆ ఫారెనర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వ్యక్తిపై తీవ్రంగా మండిపడుతున్నారు. మనం ఇక మారమా? ఇలాగే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేసి మన దేశం పరువును మనమే తీస్తున్నాం. ఒక ఫారెనర్ ముందు మన దేశం పరువును తీసుకోవడం ఏంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Can we repost this video until this man is identified by @MumbaiPolice & @mybmc and heavy punishment is given to this guy who casually dumped garbage into the water 😭😭😭#FI
pic.twitter.com/TfCQiHUnmw
— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) January 13, 2026

జనవరి 12, 2026

జనవరి 10, 2026

జనవరి 10, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam