త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu Serial | సౌంద‌ర్య అమ్మోరు మూవీకి సీక్వెల్‌గా తెలుగు టీవీ సీరియ‌ల్ – లాంఛింగ్ డేట్ , చానెల్ ఇవే

సౌంద‌ర్య అమ్మోరు మూవీకి సీక్వెల్ రాబోతుంది. కానీ సినిమాగా కాకుండా టీవీ సీరియ‌ల్‌గా ఈ సీక్వెల్ తెర‌కెక్కుతోంది. అమ్మోరు పేరుతోనే రూపొందుతున్న ఈ సీరియ‌ల్ ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ఈటీవీలో టెలికాస్ట్ కాబోతుంది.

N

Entertainment | Published On Jan 16, 2026, 8.10 pm IST

Telugu Serial |  సౌంద‌ర్య అమ్మోరు మూవీకి సీక్వెల్‌గా తెలుగు టీవీ సీరియ‌ల్ –  లాంఛింగ్ డేట్ , చానెల్ ఇవే
Advertisement

Telugu Serial |  సౌంద‌ర్య హీరోయిన్‌గా న‌టించిన అమ్మోరు మూవీ ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. తెలుగులో భ‌క్తి ప్ర‌ధాన సినిమాల‌కు ఒక ర‌కంగా ఈ సినిమానే స్ఫూర్తిగా చెబుతుంటారు. కేవ‌లం కోటి ఎన‌భై ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో రూపొందిన అమ్మోరు అప్ప‌ట్లోనే ప‌ది కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. థియేట‌ర్ల‌లో యాభై రోజుల వ‌ర‌కు హౌజ్‌ఫుల్స్‌తో ర‌న్ అయ్యింది. గ్రాఫిక్స్‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన సినిమాల్లో అమ్మోరు ఒక‌టిగా నిలిచింది.
కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీలో సౌంద‌ర్య (Soundarya )హీరోయిన్‌గా న‌టించ‌గా...అమ్మోరి పాత్ర‌ను ర‌మ్య‌కృష్ణ చేసింది.

టీవీ సీరియ‌ల్‌...

అమ్మోరు మూవీకి సీక్వెల్ (Sequel) తెర‌కెక్కుతోంది. అయితే ఈ సీక్వెల్ సినిమాగా కాకుండా టీవీ సీరియ‌ల్‌గా (Tv Serial) తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అమ్మోరు పేరుతోనే రూపొందుతున్నఈ సీరియ‌ల్ లాంఛింగ్ డేట్‌, టీవీ చానెల్ ఏవ‌న్న‌ది రివీల‌య్యాయి. అమ్మోరు టీవీ సీరియ‌ల్ ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ఈటీవీ లో టెలికాస్ట్ కాబోతుంది.

చ‌రిష్మా శ్రీక‌ర్‌...

అమ్మోరు సీరియ‌ల్‌లో చ‌రిష్మా శ్రీక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సీరియ‌ల్‌తోనే బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అమ్మోరులో సౌంద‌ర్య చేసిన పాత్ర‌లో చ‌రిష్మా శ్రీక‌ర్ క‌నిపించ‌బోతుండ‌గా... ర‌మ్య‌కృష్ణ పోషించిన‌ దేవ‌త పాత్ర‌లో నేత్ర జాద‌వ్ క‌నిపిస్తోంది. సీనియ‌ర్ సీరియ‌ల్ యాక్ట‌ర్‌ శ్రీప్రియ శ్రీక‌ర్ కూతురే చ‌రిష్మా. శ్రీప్రియ శ్రీక‌ర్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో అప‌ర్ణ పాత్ర చేస్తోంది.అమ్మోరు సినిమాను నిర్మించిన మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ టీవీ సీరియ‌ల్‌ను తెర‌కెక్కిస్తోంది.అమ్మోరు సీరియ‌ల్ కంటే ముందు చ‌రిష్మా శ్రీక‌ర్ తెలుగులో రుద్రాంగి, ల‌క్ష్మీక‌టాక్షం, క్షీర సాగ‌ర మ‌ధ‌నం, విద్రోహితో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement