త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat sleeper Train | వందే భారత్ స్లీపర్ రైలు: తొలిరోజే చెత్తకుప్పగా మారిన కోచ్‌లు.. ‘ఇదేనా సివిక్ సెన్స్’ అంటూ నెటిజన్ల ఫైర్

ఖాళీ కప్పులు, వాడిన స్పూన్లు, పేపర్లు, ఫుడ్ వేస్ట్, ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయడం చూసిన ప్యాసెంజర్.. చూడండి.. ఇది ఎవరి తప్పిదం. రైల్వే అధికారులదా? ప్రభుత్వానిదా? లేక మనదా? ఇదేనా సివిక్ సెన్స్ అంటే? అంటూ ప్రశ్నించాడు.

J

Viral news | Published On Jan 18, 2026, 6.18 pm IST

Vande Bharat sleeper Train | వందే భారత్ స్లీపర్ రైలు: తొలిరోజే చెత్తకుప్పగా మారిన కోచ్‌లు.. ‘ఇదేనా సివిక్ సెన్స్’ అంటూ నెటిజన్ల ఫైర్
Advertisement

Vande Bharat sleeper Train | విదేశాల్లో రోడ్లు, వాహనాలు, రైళ్లు ఎంత నీట్‌గా ఉంటాయని మనమే చెప్పుకుంటాం. మన దగ్గర అలాంటి సౌకర్యాలు కల్పిస్తే చెత్త చెత్త చేస్తాం. నిజానికి భారత్‌లో సివిక్ సెన్స్ అనేది పెద్ద జోక్ అని అంటుంటారు. అది నిజమే అని తాజా ఘటనతో మరోసారి నిరూపితం అయింది. వందే భారత్ స్లీపర్ రైలు శనివారం ప్రారంభం అయిందో లేదో రైలులో ఉన్న కోచ్‌లను చెత్తకుప్పలతో నింపేశారు ప్రయాణికులు. కోచ్‌లలో ఎక్కడపడితే అక్కడ పడేసిన చెత్తను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రీమియం క్లాస్ రైలును కూడా చెత్తగా చేసేస్తున్నారు. కొంచెం కూడా సివిక్ సెన్స్, కామన్ సెన్స్ ఉండదా? అంటూ ఆ వీడియోలపై నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు.

వెస్ట్ బెంగాల్‌లోని మాల్దా నుంచి అస్సాంలోని గౌహతి రూట్‌లో వందే భారత్ తొలి స్లీపర్ రైలును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ రైలు ప్రారంభం అయిన కొద్ది సేపటికే రైలు లోపల కోచ్‌లు చెత్తతో నిండి ఉండటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఖాళీ కప్పులు, వాడిన స్పూన్లు, పేపర్లు, ఫుడ్ వేస్ట్, ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయడం చూసిన ప్యాసెంజర్.. చూడండి.. ఇది ఎవరి తప్పిదం. రైల్వే అధికారులదా? ప్రభుత్వానిదా? లేక మనదా? ఇదేనా సివిక్ సెన్స్ అంటే? అంటూ కోచ్‌లలో ఉన్న చెత్తను చూపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇలాంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వాళ్లు సివిక్ సెన్స్ ఉన్నవాళ్లు అయితేనే వెళ్లండి. లేకపోతే అలాంటి రైళ్లలో ప్రయాణించి వాటిని చెత్తతో నింపకండి. టాయిలెట్ మ్యానర్స్ తెలిసిన వాళ్లు, కోచ్‌ని శుభ్రంగా ఎలా ఉంచాలో తెలిసినవాళ్లే అలాంటి రైళ్లలో ప్రయాణిస్తే బెటర్ అంటూ నెటిజన్లు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు.

Vande Bharat Sleeper 1st Day..
byu/Lol9xm inindianrailways

Advertisement

తాజావార్తలు

Advertisement