Tollywood Heroine | ఆదివారం సోషల్ మీడియాలో ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్ చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. క్యూట్ అంటూ ఈ ఫొటోను ఉద్దేశించి అభిమానులు కామెంట్స్ పెడుతోన్నారు. ఈ ఫొటోలో కనిపించిన హీరోయిన్ మరెవరో కాదు స్వీటీ అనుష్క శెట్టి. ఈ ఫొటోలో సింపుల్ లుక్‌లో ముద్దుముద్దుగా అనుష్క శెట్టి కనిపించి ఆకట్టుకుంది. అనుష్క చిన్నప్పటి ఫొటోను ఆమె అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. బెస్ట్ మెమోరీ అంటూ పేర్కొంటున్నారు. బాహుబలి...అరుంధతి... టాలీవుడ్లో మిర్చి, బాహుబలి, బిల్లా, ఖలేజా లాంటి కమర్షియల్ సినిమాలే కాకుండా అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. నవతరం నాయికలకు స్ఫూర్తిగా నిలిచింది. కెరీర్ పీక్స్‌లో ఉండగా సైజ్ జీరో లాంటి ప్రయోగాలు అనుష్క కెరీర్‌ను దెబ్బతీశాయి. ఈ సినిమాల వల్ల బరువు పెరిగిన అనుష్క సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఘాటీతో... గత ఏడాది ఘాటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క. క్రిష్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. శీలావతి క్యారెక్టర్లో యాక్షన్ ఓరియెంటెడ్ రోల్లో అనుష్క తన యాక్టింగ్‌తో అదరగొట్టిన రొటీన్ స్టోరీ కారణంగా ఘాటీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఘాటీ తర్వాత తెలుగులో అనుష్క నెక్స్ట్ మూవీ ఏదన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. మలయాళంలోకి... మరోవైపు ఈ ఏడాది మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనుష్క. కథనార్ పేరుతో ఓ హారర్ మూవీ చేస్తోంది. జయరామ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో అనుష్క నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు సమాచారం. pic.twitter.com/HABhEtY4ue — Anushka Shetty (@_anushkashetty) January 18, 2026