TTD | తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. ఏప్రిల్ కోటా రిలీజ్ షెడ్యూల్ ఇదే..!
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Devotional | Published On Jan 18, 2026, 7.10 pm IST
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. శ్రీవారి ఆర్జితసేవలైన సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధ కోటాను జనవరి 19న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులంతా 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని.. అదే రోజున మధ్యాహ్నం 12 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లు జారీ అవుతాయని తెలిపింది. 23వ తేదీ మధ్యాహ్నం వరకు డబ్బులు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని టీటీడీ పేర్కొంది.
ఇక 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. వర్చువల్ సేవలు, దర్శనం స్లాట్స్ కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పింది. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రవేశ దర్శనం కోటాను 23న ఉదయం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది.
ఈ నెల 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు దేవస్థానం తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. మార్చి మాసానికి సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేళ కోటాను 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పింది. భక్తులంతా ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకొని, సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






