WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్‌ను దాటేసిన స్మృతి మంధాన..!
WPL 2026 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుతమైన బ్యాటింగ్ ద్వారా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మరో ఘనత సాధించింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. స్మృతి మంధాన 61 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి తృటిలో మిస్సైంది.
WPL 2026 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుతమైన బ్యాటింగ్ తో వుమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మరో ఘనత సాధించింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. స్మృతి మంధాన 61 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి తృటిలో మిస్సైంది. అయినప్పటికీ, ఈ ఇన్నింగ్స్‌తో ఆమె ఒక కీలక మైలురాయిని సాధించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు బ్యాటర్‌గా నిలిచింది.
ఢిల్లీపై మ్యాచ్‌లో స్మృతి 13 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను అధిగమించి, వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్‌గా ఘనత సాధించింది. 2024 సీజన్‌లో గుజరాత్‌పై హర్మన్‌ప్రీత్ 48 బంతుల్లో 95 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండేది. తాజాగా ఆ రికార్డు స్మృతి ఖాతాలో చేరింది.
ఇప్పటి వరకు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఏ ప్లేయర్ కూడా సెంచరీని సాధించలేకపోయింది. ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్ పేరిట నమోదైంది. ఆర్‌సీబీ తరఫున డివైన్ 2023లో గుజరాత్ జెయింట్స్‌పై 36 బంతుల్లో 99 పరుగులు చేసింది. 2025 సీజన్‌లో యూపీ వారియర్స్ తరఫున బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ప్లేయర్ జార్జియా వోల్ ఆర్‌సీబీపై 56 బంతుల్లోనే 99 పరుగులు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు 90 పరుగుల మార్క్‌ను దాటిన ఏకైక బ్యాటర్‌గా డివైన్ నిలిచింది.
ఆర్‌సీబీ-ఢిల్లీ మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్‌సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాలుగు మ్యాచుల్లో మూడు ఓడిపోయిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. షెఫాలీ వర్మ 62 పరుగుల ఇన్నింగ్స్ సహాయంతో 20 ఓవర్లలో 166 పరుగులు చేయగలిగింది. స్మృతి, జార్జియా వాల్ అర్ధ సెంచరీలు చేయడంతో 18.2 ఓవర్లలో 169 పరుగులు చేసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






