త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఇండిగో మహిమ : తమ రిసెప్షన్​కు ఆన్​లైన్​లో హాజరైన నవదంపతులు

ఇండిగో ఫ్లైట్ రద్దులతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు కోకొల్లలు. హుబ్బళ్ళికి చెందిన కొత్త దంపతులు తమ రిసెప్షన్‌కి ప్రత్యక్షంగా రాలేక వీడియో కాల్ ద్వారా పాల్గొన్న అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది.

a

Viral news | Published On Dec 8, 2025, 9.56 pm IST

ఇండిగో మహిమ : తమ రిసెప్షన్​కు ఆన్​లైన్​లో హాజరైన నవదంపతులు

indigo-newlyweds-attend-their-own-reception-online

Advertisement

IndiGo Chaos Forces Newlyweds to Attend Their Own Reception Online

హుబ్బళ్ళి: దేశవ్యాప్తంగా ఇండిగో విమాన అంతరాయాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.  రెండు రోజుల్లోనే వెయ్యికి పైగా విమానాలు రద్దు కావడంతో అనేక మంది తమ కార్యక్రమాలకు, ఇళ్లకు, ఇంటర్వ్యూలకు పెళ్లిళ్లకు వెళ్లలేక ఇబ్బందిపడ్డారు. పెళ్లికూతురో, కొడుకో సమయానికి రాలేక ఎన్నో వివాహాలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో హుబ్బళ్లిలో జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు తాము ఏర్పాటు చేసుకున్న రిసెప్షన్​కు ఇండిగో పుణ్యమా అని హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన రిసెప్షన్​ను వీడియో కాల్​ ద్వారా వీక్షించి, అతిథులను పలకరించారు.

హుబ్బళ్ళికి చెందిన మేఘా క్షీరసాగర్, భువనేశ్వర్​కు చెందిన సంగమ్ దాస్ — ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. నవంబర్ 23న భువనేశ్వర్‌లో వివాహం చేసుకున్న వీరు, డిసెంబర్ 2న హుబ్బళ్లి గుజరాత్ భవన్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించాలనుకున్నారు. ఇంకేం, అహ్వానాలు వెళ్లిపోయాయి. కుటుంబసభ్యులు, బంధువులంతా సంతోషంగా వేడుకకు విచ్చేసారు. కానీ, అసలు ఉండాల్సిన కొత్త జంట మాత్రం లేదు. భువనేశ్వర్​ నుండి హుబ్బళ్లికి చేరుకొని, రిసెప్షన్​ను జరుపుకోవాలనుకున్న దంపతులు ఇండిగో దెబ్బకు భువనేశ్వర్లోనే ఇరుక్కుపోయారు.

రిసెప్షన్‌కి రాలేకపోయిన కొత్త జంటభారీ తెరపై వేడుకలు

డిసెంబర్ 2 ఉదయం చిన్నపాటి ఆలస్యంతో ప్రారంభమైన ప్రయాణం, చివరకు వరుస రద్దులతో డిసెంబర్ 3 ఉదయం వరకు సాగింది. ఇండిగో పైలెట్లు అందుబాటులో లేకపోవడం, ప్రత్యామ్నాయ విమానాలేమీ లేకపోవడంతో మేఘా–సంగమ్ భువనేశ్వర్‌లోనే చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా హుబ్బళ్ళిలో హాల్ సిద్ధంగా ఉంది, అతిథులు కూడా వచ్చేశారు. దంపతులు వచ్చే పరిస్థితి లేదని వారి తల్లిదండ్రులకు అర్థమై తరుణోపాయాన్ని ఆలోచించారు. దాంతో అత్యవసరంగా, వధువు తల్లిదండ్రులే పెళ్లికుమార్తెపెళ్లికొడుకు స్థానంలో కూర్చొని సంప్రదాయ కార్యక్రమాలు చేపట్టారు.

 

మరోవైపు నవదంపతులు వీడియో కాల్ ద్వారా కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌పై కనిపిస్తూ అతిథులతో మాట్లాడారు, వారు కూడా వాళ్లను ఆత్మీయంగా పలకరించారు. దాదాపు 1000 కి.మీ దూరంలో ఉన్నా, రిసెప్షన్ వాతావరణం మాత్రం యథావిధిగా కొనసాగింది.

ఇండిగో అంతరాయాల కారణంగా దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఇలాంటి అనుభవాలను పలువురు పంచుకుంటున్నారు. 48 గంటల్లో 1000కి పైగా ఫ్లైట్లు షెడ్యూల్ నుంచి మాయం కావడంతో, వివిధ వర్గాల ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా అతలాకుతలం అయిపోయాయి. ఇండిగో ఫ్లైట్ రద్దులతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి.  అదే కారణంతో హుబ్బళ్ళి కొత్త దంపతులు తమ రిసెప్షన్‌కి ప్రత్యక్షంగా రాలేక వీడియో కాల్ ద్వారా పాల్గొన్న అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది.

Advertisement

తాజావార్తలు

Advertisement