Viral Video | బెంగళూరులో రద్దీ రోడ్డులో ఓ స్కొడా కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందిరానగర్‌లోని 100 ఫీట్ల రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. తప్ప తాగి స్కొడా కారును నడుపుతున్న ఓ వ్యక్తి వేగంగా దూసుకొచ్చి డివైడర్ని ఢీకొట్టి రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తులను ఢీకొట్టబోయాడు. క్షణాల్లో కారు దూసుకొస్తున్న విషయాన్ని గమనించిన వాళ్లు వెంటనే అలర్ట్ అయి పక్కకు తప్పుకున్నారు. రెప్పపాటులో వాళ్లు ఆ ప్రమాదం నుంచి బయటపడినా.. ఆ కారు ముందు ఉన్న బైక్‌ని ఢీకొట్టి రెస్టారెంట్ గోడను తాకి ఆగిపోయింది. దీంతో ఆ రెస్టారెంట్ గోడ కూలిపోయింది. ఈ ఘటన పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ముందు నిలబడి ఉన్న ఓ గుంపు సడెన్‌గా కారు దూసుకురావడం చూసి వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు నడిపిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకొని కారు సీజ్ చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. Drunk Driver Crashes Into Indiranagar Restaurant, Pedestrians Escape Narrowly,Car seized. Bengaluru A major accident was narrowly averted late Thursday night on #Indiranagar’s bustling 100 Feet Road when a drunk driver lost control of his car, jumped a divider, and rammed… pic.twitter.com/sA8mMj0Ikb — Yasir Mushtaq (@path2shah) January 10, 2026