త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Explosion in Odisha | తయారు చేస్తుండగానే పేలిన బాంబు.. ఇద్దరు మృతి.. వీడియో వైరల్

చికిత్స పొందుతున్న వారిలో ఓ వ్యక్తిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని, క్రిమినల్ రికార్డు ఉందని పోలీసులు గుర్తించారు. వీళ్లంతా కలిసి ఏదైనా నేరం చేయడానికి ప్లాన్ చేశారా? అందుకే బాంబు తయారు చేస్తున్నారా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

J

Viral news | Published On Feb 16, 2026, 3.54 pm IST

Explosion in Odisha | తయారు చేస్తుండగానే పేలిన బాంబు.. ఇద్దరు మృతి.. వీడియో వైరల్
Advertisement

Explosion in Odisha | మనుషులను చంపే బాంబులు తయారు చేయడం అంత ఈజీ కాదు. ప్రాణాలతో చెలగాటం ఆడటమే. బాంబులు తయారు చేయడం కూడా ఒక ఆర్ట్. దానికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఉగ్రవాదుల్లో కొందరు బాంబులు తయారు చేయడంలో నిష్ణాతులుగా ఉంటారు. తాజాగా కొందరు బాంబులు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు అవి పేలడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు కలిసి ఓ బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్స్ పక్కన ఎవ్వరికీ కనపడకుండా బాంబులు తయారు చేస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా అక్కడ భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ఏం జరిగిందా అని చుట్టుపక్కన ఉండే వాళ్లు బయటికి పరుగులు తీశారు. ఆ సమయంలో అక్కడ ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అందరికీ తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన జనవరి 27న భువనేశ్వర్‌లోని సుందర్‌పాడ అనే ప్రాంతంలో మధ్యాహ్నం చోటు చేసుకుంది.

అక్కడే ఉంటున్న ఓ కుటుంబం ఈ పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పేలుడు సంభవించిన ప్లేస్‌లో గన్ పౌడర్, బాంబు తయారీ కోసం ఉపయోగించే పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే తల్లికొడుకు మృతి చెందారు. అదే కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉన్నారు. దీంతో అసలు ఏం జరిగింది అనే విషయంపై పోలీసులకు క్లారిటీ రావడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతున్న వారిలో ఓ వ్యక్తిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని, క్రిమినల్ రికార్డు ఉందని పోలీసులు గుర్తించారు. వీళ్లంతా కలిసి ఏదైనా నేరం చేయడానికి ప్లాన్ చేశారా? అందుకే బాంబు తయారు చేస్తున్నారా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement