త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Bars At Saudi Wedding | సౌదీ పెళ్లిలో అతిథులకు 24 క్యారెట్ల గోల్డ్ బిస్కెట్ల పంపిణీ.. వీడియో వైరల్

ఆ వీడియో నిజమే కానీ.. ఆ గోల్డ్ బిస్కెట్ల అసలు కథ మాత్రం ఇది అంటూ గ్రోక్ కూడా చెప్పేయడంతో నెటిజన్లు వామ్మో నిజంగానే బంగారు బిస్కెట్లు పంచారని అనుకుంటిమి కదా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

J

Viral news | Published On Feb 12, 2026, 4.16 pm IST

Gold Bars At Saudi Wedding | సౌదీ పెళ్లిలో అతిథులకు 24 క్యారెట్ల గోల్డ్ బిస్కెట్ల పంపిణీ.. వీడియో వైరల్
Advertisement

Gold Bars At Saudi Wedding | సాధారణంగా ఏ పెళ్లిలో అయినా అతిథులకు మంచి విందు భోజనం పెడతారు. లేదంటే ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తారు. పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించినందుకు వాళ్లను తృప్తి పరిచేందుకు ఇంకా ఏవైనా ఫెసిలిటీలు కల్పిస్తారు కానీ.. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ బంగారం అయితే పంచరు కదా. అసలే బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్న రోజుల్లో గ్రాము బంగారం కొనడమే గగనంగా ఉన్న రోజుల్లో ఓ పెళ్లికి వచ్చిన అతిథులకు ఏకంగా 24 క్యారెట్ల గోల్డ్ బిస్కెట్లను పంపిణీ చేశారు. హా.. అంటూ నోరెళ్లబెట్టకండి. మొత్తం చదవండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం సౌదీలో జరుగుతున్న ఓ పెళ్లిలో గోల్డ్ బిస్కెట్లతో ఉన్న ఓ పెట్టెను పట్టుకొని ఓ వ్యక్తి పెళ్లికి వెళ్లిన అతిథులందరి దగ్గరికి వెళ్లి వాళ్లకు గోల్డ్ బిస్కెట్లు పంచుతూ ఉంటాడు. దానికి సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు మాత్రం వారెవ్వా.. ఆ పెళ్లికి మనకూ ఆహ్వానం అందితే బాగుండు అంటూ బాధపడుతున్నారు. కానీ అసలు నిజం తెలిస్తే వార్నీ అని మరోసారి నోరెళ్లబెడతారు.

అవి గోల్డ్ కలర్ కవర్‌తో చుట్టిన చాకోలేట్స్

అది 24 క్యారెట్ల గోల్డ్ కాదు.. పాడు కాదు.. అవి గోల్డ్ కలర్ కవర్‌తో చుట్టిన చాకోలేట్స్ అని మరికొందరు నెటిజన్లు ఆ వీడియోకు రిప్లయి ఇస్తున్నారు. చూడటానికి అచ్చం గోల్డ్ బిస్కెట్లలా ఉన్నా.. అవి పాట్చి అనే బ్రాండ్‌కి చెందిన లగ్జరీ చాకోలేట్స్ అని చూడటానికి అవి అచ్చం బంగారు బిస్కెట్లలానే ఉంటాయిన నెటిజన్లు చెబుతున్నారు. గ్రోక్ కూడా ఇదే విషయం చెప్పింది. ఆ వీడియో నిజమే కానీ.. ఆ గోల్డ్ బిస్కెట్ల అసలు కథ మాత్రం ఇది అంటూ గ్రోక్ కూడా చెప్పేయడంతో నెటిజన్లు వామ్మో నిజంగానే బంగారు బిస్కెట్లు పంచారని అనుకుంటిమి కదా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

https://x.com/Rainmaker1973/status/2021630741172621556

https://x.com/Engr_Farooq_/status/2021669946409759021

https://x.com/grok/status/2021633559375618115

 

Advertisement
Advertisement