త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Best Train Journey | జీవితంలో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన రైల్వే జర్నీలివే..!

Best Train Journey | రైలు ప్రయాణం అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికే కాదు.. అది ఎన్నో మెమొరీస్‌ను అందిస్తుంది. రైళ్లలో గడిచే సమయం ఎన్నో మధుర జ్ఞాపకాలకు నిలయంగా మారుతుంది. ప్రయాణంలో కిటికీలో నుంచి బయటకు చూసినప్పుడు మెల్లగా కదలిపోతున్న కొండలు, చల్లని గాలులతో పలకరించే అడవులు, మనల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది.

S

Tourism | Published On Dec 23, 2025, 9.30 pm IST

Best Train Journey | జీవితంలో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన రైల్వే జర్నీలివే..!
Advertisement

Best Train Journey | రైలు ప్రయాణం అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికే కాదు.. అది ఎన్నో మెమొరీస్‌ను అందిస్తుంది. రైళ్లలో గడిచే సమయం ఎన్నో మధుర జ్ఞాపకాలకు నిలయంగా మారుతుంది. ప్రయాణంలో కిటికీలో నుంచి బయటకు చూసినప్పుడు మెల్లగా కదలిపోతున్న కొండలు, చల్లని గాలులతో పలకరించే అడవులు, మనల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ప్రకృతి అందాలను, సంస్కృతిని, జీవనశైలిని చూపిస్తోంది. అలాంటి మధుర జ్ఞాపకాలను అందించే భారత్‌లోని అత్యత్తమ రైలు ప్రయాణాలు ముఖ్యంగా మూడు ఉన్నాయి.

కల్కా - షిమ్లా రూట్

యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత సుందరమైన రైలు ప్రయాణాల్లో కల్కా - షిమ్లా టాయ్ ట్రైన్ ఒకటి. 1903లో ఇది ప్రారంభమైంది. ఇది నారో గేజ్ రైల్వే, శివాలిక్ పర్వతాల మధ్య నుంచి షిమ్లాకు వెళ్తుంది. సుమారు 96 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతుంది. ఈ మార్గంలో మొత్తం 102 సొరంగాలు, 800 కిపైగా బ్రిడ్జిలు ఉన్నాయి. పైన్ చెట్లతో నిండిన కొండలు, బ్రిటీష్ పాలన కాలం నాటి రైల్వే స్టేషన్లు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో మంచుతో కప్పబడిన కొండలు, అడవులు ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ అభిమానులను ఆకట్టుకుంటుంది. షిమ్లాను క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలవడానికి ఈ ప్రయాణం కూడా ఒక కారణమేఅని చెప్పొచ్చు.

డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే

ఇంజినీరింగ్ అద్భుతంగా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేను పిలుస్తుంటారు. సిలిగురి మైదానాల నుంచి డార్జిలింగ్ టీ తోటలతో నిండిన కొండల వైపుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. కేవలం రెండు అడుగుల వెడల్పు ఉన్న నారో గేజ్ ట్రాక్‌పై పాత స్టీమ్ ఇంజిన్‌తో నడిచే ఈ రైలు ఎత్తయిన కొండలు, మలుపులు దాటుతూ వెళ్తుంది. మొత్తం 88 కిలోమీటర్ల ప్రయాణంలో ఎక్కడ చూసినా అడవులు, గ్రామాలు, టీ తోటలే కనిపిస్తుంటాయి.

ఈ రైల్వే మార్గంలో మరో ప్రత్యేక ఆకర్షణ బటాసియా లూప్. ఇక్కడ రైలు ఒక అందమైన తోట చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ప్రయాణిస్తుంది. ఇక్కడి నుంచి కంచెంజుగ పర్వత శ్రేణుల దృశ్యం రమణీయంగా కనిపిస్తుంది. మార్గమధ్యలో కనిపించే రద్దీ మార్గెట్లు, కొండలపై ఉండే ఇండ్లు తూర్పు మిమాలయ ప్రాంతాల దైనందిన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.

కొంకణ్ రైల్వే

ముంబై నుంచి మంగళూరు వరకు సాగే కొంకణ్ రైల్వే ప్రయాణాన్ని భారత్‌లోని అత్యంత సుందరమైన రైలు మార్గాల్లో ఒకటిగా చెబుతుంటారు. సుమారు 750 కిలోమీటర్ల పొడవున్న ఈ రైల్వే రూట్ పశ్చిమ కనుమల నుంచి సాగుతుంది. మార్గమధ్యలో కనిపించే సముద్ర తీరాలు, దట్టమైన అడవులు, నదులు, జలపాతాలు ఈ ప్రయాణాన్ని మరింత ఆకర్షణగా మారుస్తాయి. ఆధునిక ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన ఈ రైల్వే మార్గంలో మొత్తం 91 టన్నెల్స్, 2 వేలకు పైగా వంతెనలు ఉన్నాయి. వాటిలో సుమారు 6.5 కిలోమీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌లో ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో కొంకణ్ రైలు ప్రయాణం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. కొండలపై నుంచి జారిపడే జలపాతాలు, పచ్చని పొలాలు, మబ్బులతో కమ్ముకున్న ప్రకృతి దృశ్యాలను ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తాయి. పశ్చిమ కనుమల ప్రకృతి వైవిధ్యాన్ని ఆస్వాదించాలని అుకునేవారికి ఈ ప్రయాణం ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement