Airports | ఈ 4 ఎయిర్‌పోర్టులు టూరిస్ట్ ప్లేస్‌లకు ఏ మాత్రం తీసిపోవు!
Airports | సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు చాలాసార్లు డైరెక్టు ఫ్లైట్లు ఉండవు. కనెక్టింగ్ ఫ్లైట్లలోనే వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఎయిర్‌పోర్టుల్లో చాలా సమయం గడపాల్సి వస్తుంది.
Airports | సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు చాలాసార్లు డైరెక్టు ఫ్లైట్లు ఉండవు. కనెక్టింగ్ ఫ్లైట్లలోనే వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఎయిర్‌పోర్టుల్లో చాలా సమయం గడపాల్సి వస్తుంది. ఈ లేఓవర్ పీరియడ్‌లో ఒక్కోసారి గంటలు గంటలు విమానాశ్రయాల్లోనే ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో చాలామంది బోరింగ్‌గా, అలసటగా ఫీలవుతుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచంలోని కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఈ లేఓవర్ పీరియడ్‌ను కూడా చిన్నపాటి విహారయాత్రగా మార్చేస్తున్నాయి. షాపింగ్ మాల్స్ మాత్రమే కాకుండా పార్కులు, ఉద్యనవనాలు, స్పాలు, ఆర్ట్ మ్యూజియాలు, సినిమా థియేటర్లు వంటి రకరకాల సదుపాయాలు కలిపిస్తున్నాయి. అలాంటి నాలుగు ప్రత్యేక విమానశ్రయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్టు
ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో చాంగీ ఎయిర్‌పోర్టు నిలుస్తుంది. లేఓవర్ సమయాన్ని ఆనందంగా గడిపేందుకే ఈ ఎయిర్‌పోర్టు నిర్మించినట్లుగా ఉంటుంది. ఇక్కడ బటర్‌ఫ్లై, ఆర్చిడ్, కాక్టస్ గార్డెన్లలో ప్రశాంతంగా సేదతీరవచ్చు. అలాగే రూఫ్‌టాప్ స్విమ్మింగ్‌ఫుల్‌లో హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు. జ్యువెల్‌లోని రెయిన్ ఓర్టెక్స్ ఇండోర్ జలపాతం చూస్తూ మైమరిచిపోవచ్చు.
ఎయిర్‌సైడ్ స్నూజ్ లౌంజ్‌లు, స్పా పాడ్స్‌లో చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. రిలాక్స్ అవ్వడానికి ప్రతి టెర్మినల్‌లో ట్రాన్సిట్ హోటళ్లు ఉంటాయి. సెక్యూరిటీని దాటి బయటివాళ్లు ఎవరూ ఇందులోకి రాలేరు. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. మొత్తం మీద మీ విమాన ప్రయాణంలో చాంగీలో లేఓవర్ అంటే మీ ఆనందానికి ఓ బోనస్‌లాంటిదే.
హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ( దోహా)

దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానశ్రయం తక్కువ ఖర్చులతో విలాసవంతమైన సౌకర్యాలతో రూపొందింది. సన్‌లైట్‌తో నిండిన కోర్ట్‌యార్డులు, భారీ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లతో ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్, స్క్వాష్ కోర్టులు, స్పా సేవలు కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఇక విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి స్లీప్ అండ్ ఫ్లై పేరుతో ప్రైవేటు స్లీప్ క్యాబిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంచియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (సియోల్)

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఇంచియన్ విమానాశ్రయంలో లేఓవర్ అంటే కేవలం విశ్రాంతి కోసమే కాదు.. కొరియన్ సంస్కృతిని కూడా పరిచయం చేస్తుంది. ఈ విమానాశ్రయంలో ఉచిత కొరియన్ సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ హస్తకళ వర్క్‌షాప్‌లు ప్రాంతీయ వారసత్వాన్ని పరిచయం చేసే చిన్న మ్యూజియం ఉన్నాయి. అలాగే విశ్రాంతి కోసం న్యాప్ జోన్లు, ఇండోర్ గార్డెన్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌పోర్టుకు దగ్గరలోనే ఐస్ స్కేటింగ్ రింక్ కూడా ఉంది.
టోక్యో హనేదా ఎయిర్‌పోర్టు

ప్రశాంతత, క్రమశిక్షణ, అద్భుతమైన ఆహారం కోరుకునే పర్యాటకులకు టోక్యోలోని హనేదా ఎయిర్ పోర్టు బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. టోక్యో నగరాన్ని చిన్నగా చూపించినట్లుగా ఈ ఎయిర్‌పోర్టు ఉంటుంది. నూడిల్ బార్లు, షాపింగ్ స్పాట్లు, విశ్రాంతి జోన్లు, క్యాప్సూల్ తరహా ట్రాన్సిట్ హోటళ్లు ఈ విమానాశ్రయంలో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఈ ఎయిర్‌పోర్టు పై అంతస్తులో ఉన్న అబ్జర్వేషన్ డెక్ నుంచి విమాన కదలికలను కూడా చూడవచ్చు. ఎడో మార్కెట్ ప్లేస్‌లో టోక్యో విధులను రీక్రియేట్ చేశారు. ఇందులో సాధారణ షాపింగ్ మాల్‌లో ఉన్నట్లుగా గందరగోళం ఏమీ ఉండదు. ప్రశాంతంగా సమయాన్ని గడిపేయవచ్చు.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | గ్లోబల్ స్టేజ్‌పై నేషనల్ క్రష్ …. టోక్యో యానిమే అవార్డ్స్ ప్రజెంటర్‌గా రష్మిక
ఏప్రిల్ 28, 2026

Earthquake | జపాన్ను కుదిపేసిన శక్తిమంతమైన భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. ప్రజలు బయటకు రావొద్దు
ఏప్రిల్ 20, 2026

Overload | అధిక లోడ్‌తో వాహనాల్లో ప్రయాణిస్తే భారీ జరిమానా.. కేంద్రం కొత్త నియమాలు..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



