త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మీ ఫోనే ట్యాప్ అయింది..! హ‌రీశ్‌రావుకు పోలీసుల లీక్..!!

Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న మాజీ మంత్రి హ‌రీశ్‌రావును సిట్ అధికారులు దాదాపు 7 గంట‌ల పాటు విచారించిన సంగ‌తి తెలిసిందే. ఈ విచార‌ణ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావుకు పోలీసులు షాకిచ్చే లీకిచ్చారు.

S

Telangana | Published On Jan 21, 2026, 4.09 pm IST

Harish Rao | మీ ఫోనే ట్యాప్ అయింది..! హ‌రీశ్‌రావుకు పోలీసుల లీక్..!!
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న మాజీ మంత్రి హ‌రీశ్‌రావును సిట్ అధికారులు దాదాపు 7 గంట‌ల పాటు విచారించిన సంగ‌తి తెలిసిందే. ఈ విచార‌ణ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావుకు పోలీసులు షాకిచ్చే లీకిచ్చారు. అదేంటంటే.. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత కొన్ని నెల‌ల పాటు హ‌రీశ్‌రావు ఫోన్ ట్యాప్ అయిన‌ట్లు ఆధారాల‌తో స‌హా హ‌రీశ్‌రావుకు పోలీసులు వివ‌రించిన‌ట్లు స‌మాచారం. హ‌రీశ్‌రావు ఫోన్ ఏయే తేదీల్లో ట్యాప్ అయిందో సిట్ అధికారులు చెప్పిన‌ట్లు తెలిసింది. హ‌రీశ్‌రావు స్పందిస్తూ.. ఇవి మీరు సృష్టించారా..? అని పోలీసులు అడిగిన‌ట్లు స‌మాచారం. ఇక విచార‌ణ‌లో పోలీసులు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు మాజీ మంత్రి పేప‌ర్‌పై నోటీ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిట్.. త్వ‌ర‌లోనే హ‌రీశ్‌రావు అనుచ‌రులైన ఆరుగురికి నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

హ‌రీశ్‌రావు విచార‌ణ‌పై సీపీ స‌జ్జ‌నార్ ఏమ‌న్నారంటే..?

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ సంద‌ర్భంగా అడిగిందే అడుగుడు త‌ప్ప ఏం లేదు.. ఉత్త సొల్లు అని హ‌రీశ్‌రావు మీడియాతో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. గంట‌కు, అర‌గంట‌కు ఫోన్ కాల్స్ రావ‌డంతో సిట్ అధికారులు బ‌య‌ట‌కు వెళ్లి మాట్లాడి వ‌చ్చార‌ని, ఆ ఫోన్ కాల్స్ రేవంత్ రెడ్డి చేశారో, స‌జ్జ‌నార్ చేశారో త‌న‌కైతే తెల్వ‌ద‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సీపీ స‌జ్జ‌నార్ స్పందిస్తూ.. తన కుమారుడి ఫ్లైట్ టైం అయిందని హరీష్ రావు విజ్ఞప్తి చేయడంతో సిట్ అధికారులు విచారణను ముగించి ఆయన్ని బయటికి పంపించారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయొద్దని హరీష్ రావును ఆదేశించాం. అవసరమైతే హరీష్ రావుని మళ్ళీ విచారణకు పిలుస్తాం. అధికారులు అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం ఇచ్చారు. ఈ కేసు విషయంలో ప్రజలెవరూ తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు అని సీపీ సజ్జనార్ విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement