Ramchandar Rao | టైం మీరే చెప్పండి.. 10 మందిని తీసుకురండి చాలు
Ramchandar Rao | మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సవాల్‌ను స్వీకరిస్తున్నానని.. టైం ఎప్పుడో ఆయనే చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
- సీఈవో దగ్గరే కూర్చుందాం.. అక్కడే చెక్ చేద్దాం
- పొన్నం సవాల్‌ను స్వీకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సవాల్‌ను స్వీకరిస్తున్నానని.. టైం ఎప్పుడో ఆయనే చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఓటు లేని 10 మందిని తీసుకొస్తే చాలన్నారు. సీఈవో దగ్గరే కూర్చుండి అక్కడే చెక్ చేద్దామని చెప్పారు. మీరు మజ్లిస్ దోస్తులను తీసుకొస్తారని తెలుసని వ్యాఖ్యానించారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు ఉన్న కేబినెట్ మీటింగ్‌ను పక్కన బెట్టి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సహా మంత్రులంతా ఢిల్లీ (Delhi) వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఆన్నే నమోదు చేయిద్దాం..
పొన్నం ప్రభాకర్ నాకు ఛాలెంజ్ చేశారు. దానికి నేన్ సిద్ధంగా ఉన్నా. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దగ్గర ఉంటా. మీరు ఓటు లేనోళ్లను 10 మందిని తీసుకురండి చాలు. నాకు తెల్సి మీరు మజ్లిస్ వాళ్లను తీసుకొస్తరు. వాళ్లతో పాటు అసదుద్దిన్‌ను, అక్బరుద్దిన్ కూడా తీస్కరావొచ్చు. అక్కడే నిలబెట్టి కంప్యూటర్‌లో చెక్ చేద్దాం. ఓటు లేదనేది వేరు. ఓటు డిలీట్ అయిందని మీరు ప్రూవ్ చేస్తే.. అక్కడికక్కడే ఓటు నమోదయ్యే ప్రొసీజర్‌ను మనం ఫాలో అవుదాం. నోటీస్ లేకుండా ఏ ఓటు డిలీట్ కాదు. టైం ఎప్పుడో మీరే చెప్పండి. నేను సీఈవో దగ్గరకొస్తాను. మీ దోస్తులు మజ్లిస్ వాళ్లను తీసుకురండి. ఎందుకంటే మీ దగ్గర వేరేవాళ్లుండరు వాళ్లు తప్పా.
రైతులు చనిపోతుంటే ఢిల్లీ పోతరా?
ఇక్కడ రైతులు చనిపోతుంటే మీరంతా స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి పోతరా? ఎంత నిర్లక్ష్యం ఇది. రాహుల్ గాంధీ పిచ్చి తుగ్లక్ చేసే పనులకు పోవాల్నా మీరు? ఏముందండి అక్కడ. ఎలాన్ మస్క్ ఏమైనా ఫ్లైట్ పంపిచ్చిండా ఏంది? రరాహుల్ గాంధీకి ట్రంప్‌తోని దోస్తానా ఎక్కువైంది కదా. నీళ్లు లేక ప్రజలంత చనిపోతున్నరు. హైదరాబాద్‌లో తాగడానికి నీళ్లు లేవ్. కరెంటు కోతలు ఉన్నయ్. తెలంగాణ ప్రజల ముడుపు మాత్రం అక్కడ ఇచ్చి వస్తుంటరు. రైతుల సమస్యలను తీర్చకపోతే, ఫసల్ బీమా అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం తప్పదు. ఈరోజు ఉన్న కేబినెట్ మీటింగును పక్కన పెట్టి పనికి రాని పనికోసం ఢిల్లీకి వెళ్లడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నం.
బీజేపీ రావణ్ అంట..
నిన్న గోవాలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిండు. బీజేపీ రావణ్ అంట.. కాంగ్రెస్ రాముడంట. కాంగ్రెస్ అయితే ఓసామా బిన్ లాడెన్ కావాలి గానీ.. రామ్ ఎట్లయితది? రాక్షసుడు అనే లక్షణాలు మీకున్నయ్. ఎమర్జెన్సీ పెట్టి జైళ్లల్ల వేసిండ్రు. పెళ్లి కానోళ్లను కూడా స్టెరిలైజ్ చేసిండ్రు. మీరు రామున్ని నమ్మరు కదా.. రామాలయం నిర్మాణం కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. సుప్రీంకోర్టులో వాదన పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అయోధ్యకు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెళ్లారో చెప్పండి. మొన్ననే రాముడు ధనికుల దేవుడు, శివుడు పేదల దేవుడని చెప్పినవ్. ఇప్పుడు రాముడు అంటున్నవ్. దేవుళ్లను హేళన చేయకండి మీరు.
2014కు ముందు ఎన్నో స్కాంలు జరిగాయ్. అన్ని రంగాల్లో భారత్ వెనకబడింది. కానీ మోదీ వచ్చాక ప్రతి పేదవాడికి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. రోడ్లు, ఎయిర్‌పోర్ట్‌ల వంటి రకరకాల అభివృద్ధి చేశారు. దాదాపు రూ.13 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చారు. 2047 వరకు వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ చూడాలి. ఆ దిశలో మోదీ పని చేస్తున్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతయ్. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెల్వదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే ఇదే అని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు

Farmers Protest | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి తప్పు చేశాం.. ఇప్పుడు చెప్పులతో కొట్టుకుంటున్నం
అక్టోబర్ 12, 2026

Delhi Tour of Congress Leaders | ఎల్‌నినోపై మీటింగన్నారు.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు
అక్టోబర్ 12, 2026

RS Praveen Kumar | గురుకుల అవినీతిపై సీఎంకు ఫిర్యాదా?.. కుంభకోణం సూత్రధారే రేవంత్ రెడ్డి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అక్టోబర్ 12, 2026
తాజావార్తలు
- ●Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..
- ●Meenakshi Chaudhary | టాలీవుడ్లో కొత్త కాంబో సెట్ - నితిన్ సరసన మీనాక్షి
- ●Srikanth Daughter | టాలీవుడ్లోకి మరో వారసురాలు - టీనేజ్ లవ్‌స్టోరీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు
- ●Suta | రూ.6 లక్షలతో మొదలు.. రూ.73.5 కోట్లకు చేరిన సోదరీమణుల వ్యాపారం..
- ●Farmers Protest | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి తప్పు చేశాం.. ఇప్పుడు చెప్పులతో కొట్టుకుంటున్నం
- ●Delhi Tour of Congress Leaders | ఎల్‌నినోపై మీటింగన్నారు.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు
Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..

Meenakshi Chaudhary | టాలీవుడ్లో కొత్త కాంబో సెట్ - నితిన్ సరసన మీనాక్షి

Srikanth Daughter | టాలీవుడ్లోకి మరో వారసురాలు - టీనేజ్ లవ్‌స్టోరీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు

Suta | రూ.6 లక్షలతో మొదలు.. రూ.73.5 కోట్లకు చేరిన సోదరీమణుల వ్యాపారం..



