త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srikanth Daughter | టాలీవుడ్‌లోకి మ‌రో వార‌సురాలు – టీనేజ్ ల‌వ్‌స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న‌ శ్రీకాంత్ కూతురు

టాలీవుడ్‌లోకి మ‌రో వార‌సురాలు ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ కూతురు మేధ టీనేజ్ ల‌వ్‌స్టోరీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు ప‌రిచ‌య‌మ‌వుతోంది. మైత్రీ ఇన్ ల‌వ్ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో జై జాస్తి హీరోగా న‌టిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ సోమ‌వారం రిలీజైంది. పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

N

Entertainment | Published On Oct 12, 2026, 2.02 pm IST

Srikanth Daughter | టాలీవుడ్‌లోకి మ‌రో వార‌సురాలు  – టీనేజ్ ల‌వ్‌స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న‌  శ్రీకాంత్ కూతురు
Advertisement

Srikanth Daughter | టాలీవుడ్‌లోకి మ‌రో వార‌సురాలు ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. టీనేజ్ ల‌వ్‌స్టోరీతో టాలీవుడ్‌లో తొలి అడుగు వేయ‌బోతుంది. ఈ మూవీ  ఫ‌స్ట్ లుక్ సోమ‌వారం రిలీజ్ చేశారు.. జై జాస్తి
హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు పృథ్వీ వ‌నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో రొమాంటిక్‌గా హీరోహీరోయిన్లు క‌నిపిస్తున్నారు. యువజంట‌తో మొద‌లై ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోయే అంద‌మైన ప్రేమ‌క‌థ ఇది అంటూ ఈ పోస్ట‌ర్‌కు మేక‌ర్స్ ఓ క్యాప్ష‌న్‌ను జోడించారు. సోమ‌వారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు డైరెక్ట‌ర్ నందిని రెడ్డి గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్‌ను వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ చెప్పారు.

చైల్డ్ యాక్ట‌ర్‌...

అనుష్క రుద్ర‌మ‌దేవి సినిమాలో చైల్డ్ యాక్ట‌ర్‌గా మేధ న‌టించింది. చిన్న‌నాటి రుద్ర‌మ‌దేవిగా క‌నిపించింది. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ కూడా హీరోగా సినిమాలు చేస్తోన్నాడు.

ఆంధ్రా కింగ్ తాలూకా...

ఆంధ్రా కింగ్ తాలూకా డైరెక్ట‌ర్ మ‌హేష్ బాబు .పి ఈ సినిమాకు క‌థ‌ను అందిస్తున్నారు. పృథ్వీ వ‌నం డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గ‌తంలో 30 వెడ్స్ 21 అనే వెబ్‌సిరీస్ తెర‌కెక్కించారు పృథ్వ వ‌నం . నేరుగా యూట్యూబ్‌లో రిలీజైన ఈ వెబ్‌సిరీస్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. హీరోగా జై జాస్తికి ఇది సెకండ్ మూవీ. గ‌తంలో రాజ‌మండ్రి రోజ్ మిల్క్ అనే సినిమాలో క‌థానాయ‌కుడిగా క‌నిపించాడు. ఈ టీనేజ్ ల‌వ్‌స్టోరీకి రామ‌జోగ‌య్య శాస్త్రి త‌న‌యుడు సాయి హ‌ర్ష మ్యూజిక్ అందిస్తున్నారు.

 

 

Advertisement
Advertisement